SBI Po Prelims Result 2025: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఔట్.. ఇలా చెక్ చేసుకోండి
SBI Po Prelims Result 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహిస్తారు. ఫేజ్-1లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దీని రిజల్ట్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ పరీక్షలో100 మార్కులతో ఉంటుంది. అంతా కూడా ఆబ్జెక్టివ్ మోడల్‌లో ఉంటుంది.

SBI Po Prelims Result 2025: బ్యాంకు ఉద్యోగాలకు ఎందరో ప్రిపేర్ అవుతుంటారు. ప్రతీ ఏడాది కూడా వీటి నోటిఫికేషన్ ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో నిర్వహించిన పీఓ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో పరీక్ష రాసిన అభ్యర్థులు చూసుకోవచ్చు. ఎస్‌బీఐ పరీక్ష ఫలితాలను మార్చి 8, 16, 24, 26 తేదీల్లో నిర్వహించారు. ఈ తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరైతే సెలక్ట్ అవుతారో వారు ఎస్‌బీఐ పీఓ మెయిన్ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధించారు. వీరికి ఈ మెయిన్స్ పరీక్షకు కాల్ లెటర్ వస్తుంది. దీనికి సంబంధించినవి త్వరలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఎస్‌బీఐ పరీక్షలను చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత హోమ్ పేజ్‌లో స్క్రోల్ చేసి కెరీర్స్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ లింక్స్ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేస్తే మీ వివరాలు వస్తాయి. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి, సబ్‌మిట్ క్లిక్ చేస్తే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కనిపిస్తాయి. వీటిని వెంటనే అభ్యర్థులు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు.
ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహిస్తారు. ఫేజ్-1లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దీని రిజల్ట్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ పరీక్షలో100 మార్కులతో ఉంటుంది. అంతా కూడా ఆబ్జెక్టివ్ మోడల్‌లో ఉంటుంది. అయితే మెరిట్ ఆధారంగా ఒక్కో కేటగిరీని బట్టి మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేశారు. ఇక ఫేజ్-2లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అయితే ప్రతీ దాంట్లో కూడా కనీస అర్హత మార్కులు అయినా సాధించాలి. అయితే మెరిట్ ఆధారంగా, కేటగిరీల బట్టి ఉండే ఖాళీల ప్రకారం ఎంపిక చేస్తారు. ఫేజ్-3లో ఫైనల్ సెలక్షన్ రౌండ్ ఉంటుంది. ఈ దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్కులకు, పర్సనల్ ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. అయితే బ్యాంకు నిర్ణయించిన ఆధారంగా కనీసం అర్హత మార్కులు ఉంటాయి. ఫేజ్-2, ఫేజ్-3 మార్కుల బట్టి ఎవరైతే టాప్ మార్కులు సాధిస్తారో వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మొత్తం 600 పీవో పోస్టుల భర్తీ కోసం ఈ ఉద్యోగాలు చేపట్టారు.