Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పనిసరి
ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి. ఇవి లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనాలు కూడా రావు.

Ration Cards: ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి. ఇవి లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనాలు కూడా రావు. అయితే వీటికి ఒక ప్రక్రియ ఉంటుంది. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకోకూడదు. ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు మాత్రమే వీటికి అప్లై చేసుకోవాలి. అయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రక్రియ స్టార్ట్ చేసింది. వీటికి అప్లై చేసుకోవడానికి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది. మే 7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో వీటిని అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారు వెంటనే అప్లై చేసుకోవాలని సూచించింది. కేవలం కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా.. మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ ప్రక్రియ కూడా దీనికి పూర్తి అయ్యింది.
Read Also: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
ప్రభుత్వం నిర్ణయంతో…. కొత్త రేషన్ కార్డులను పొందటమే కాకుండా…మార్పులు, చేర్పులకు కూడా అవకాశం లభించినట్లు అయింది. ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డు కావాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. రేషన్ కార్డు ఎవరైతే పొందాలని అనుకుంటున్నారో.. వారు తప్పకుండా ఏపీ రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి. అలాగే ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. అంటే హౌస్ హోల్డ్ మాపింగ్‌లో ఉంటేనే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అయితే వీరు ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో.. అక్కడ మాత్రమే కార్డుకు అప్లై చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. అయితే ఈ అడ్రస్ కూడా సొంత గ్రామానికి చెంది ఉండాలి. రెండింటిలో కూడా ఒకే గ్రామం ఉంటేనే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి. అలాగే అమ్మాయిలకు పుట్టింటి తరఫున, అత్తవారింటి తరపున కార్డులో పేరు ఉండకూడదు. ఇలా ఎందులో కూడా లేని వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తారు.
Read Also: మదర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన మూవీస్ ఇవే
పిల్లలను కూడా రేషన్ కార్డులో యాడ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. అయితే వీరిని యాడ్ చేయాలంటే తప్పకుండా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే పెళ్లి అయిన వారు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డులో భర్త పేరు బట్టి యాడ్ చేస్తారు. అయితే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. లేకపోతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కుదరదు. అయితే వీరు ప్రజాసాధికార సర్వేలో వేరేగా ఉండాలి. లేకపోతే వీరిని విభజించడం కష్టం. అయితే బియ్యం కార్డు నుంచి కేవలం చనిపోయిన వారిని మాత్రమే తొలగిస్తారు. మిగతా వారిని మాత్రం అసలు తొలగించరు. అయితే కొందరి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంటుంది. ఇలా ఏదో విధంగా తప్పు ఉంటే మాత్రం వారిని కొత్త ఆధార్‌తో ప్రజాసాధికార సర్వేలో యాడ్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అలాగే అడ్రస్ కూడా గ్రామానికి చెంది ఉండాలి. అదే సచివాలయ పరిధికి చెంది ఉంటేనే అప్లై చేసుకోవాలి. అప్పుడు అడ్రస్ ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇది కూడా కుటుంబ పెద్ద ఎవరు ఉంటే వారి వేలి ముద్రతో మాత్రమే వేస్తే అవుతుంది. లేకపోతే కాదు.