Eating at night: రాత్రిపూట తినడం మానేస్తున్నారా.. తస్మా్త్ జాగ్రత్త
రాత్రిపూట భోజనం చేయడం చాలా ముఖ్యం. కొందరు వ్యక్తిగత కారణాలు, వర్క్ బిజీలో పడి రాత్రిపూట పూర్తిగా భోజనం చేయరు. ముఖ్యంగా డైట్ పాటించేవారు అయితే అసలు రాత్రిపూట పూర్తిగా భోజనం చేయరు. నైట్ టైమ్ తినడం మానేస్తే..

Eating at night: రాత్రిపూట భోజనం చేయడం చాలా ముఖ్యం. కొందరు వ్యక్తిగత కారణాలు, వర్క్ బిజీలో పడి రాత్రిపూట పూర్తిగా భోజనం చేయరు. ముఖ్యంగా డైట్ పాటించేవారు అయితే అసలు రాత్రిపూట పూర్తిగా భోజనం చేయరు. నైట్ టైమ్ తినడం మానేస్తే.. బరువు తగ్గుతారని భావిస్తారు. అయితే రాత్రిపూట భోజనం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట తినకుండా అసలు నిద్రపోకూడదని చెబుతున్నారు. చాలా మంది నైట్ టైమ్ తినకుండా నిద్రపోతారు. దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఫుడ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాత్రిపూట పూర్తిగా తినకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
పోషకాల లోపం
రాత్రిపూట పూర్తిగా తినడం మానేస్తే పోషకాహార లోపం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు అలసట, బలహీనత, నీరసం, చిరాకు వంటివి కూడా వస్తాయని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట తినకుండా నిద్రపోతారు. మళ్లీ ఉదయం టిఫిన్ చేసే వరకు ఎక్కువ గంటల సమయం ఉంటుంది. దీనివల్ల కడుపు ఖాళీగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకుండా అసలు నిద్రపోవద్దు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం తక్కువగా తీసుకుంటారు. ఇందులో పెద్దగా పోషకాలు ఉండవు. రాత్రి భోజనంలోనే మీకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
జీర్ణ సమస్యలు
ఎక్కువ సమయం ఫుడ్ తినకుండా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం తిని ఉంటారు. మళ్లీ రాత్రి వరకు తినకుండా ఉంటే.. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట కనీసం టిఫిన్ అయినా కూడా తీసుకోండి.
Read Also: బౌన్సర్ నుంచి క్యాథలిక్ చర్చి వరకు.. పోప్ రియల్ నేమ్ ఇదే
బరువు పెరగడం
రాత్రిపూట పూర్తిగా తినకపోవడం వల్ల బరువు పెరుగుతారు. డైలీ తినేవాళ్లు ఆకస్మికంగా ఒక్కసారి తినడం మానేస్తే ఊబకాయం వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి
కడుపు ఖాళీగా ఉంటే రాత్రిపూట నిద్ర పట్టదు. చివరకు ఇది నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట తినడం తప్పకుండా అలవాటు చేసుకోండి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.
మధుమేహం
రాత్రిపూట పూర్తిగా తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి రాత్రిపూట తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు రక్తహీనతకు కూడా దారి తీస్తుంది. రాత్రిపూట ఫుడ్ తీసుకోకపోతే నీరసం అవుతారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్ టైమ్ ఫుడ్ అయితే మానవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.