Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే పిల్లలు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండాలని, రాత్రిపూట బాగా నిద్రపట్టాలని పాలు తాగించి పడుకోబెడతారు. అయితే రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి ముందు పాలు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Milk to Your Children: పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే పిల్లలు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండాలని, రాత్రిపూట బాగా నిద్రపట్టాలని పాలు తాగించి పడుకోబెడతారు. అయితే రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి ముందు పాలు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్లు తాగితే పర్లేదు.. కానీ పిల్లలకు నిద్రపోయే ముందు పాలు తాగిపించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే నిద్రపోయే ముందు పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కడుపు సంబంధిత సమస్యలు
నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల పిల్లలకు కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాలను పిల్లలు జీర్ణం చేసుకోవడం కష్టం. వీటివల్ల పిల్లలకు చిన్నతనంలోనే కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సరిగ్గా నిద్ర కూడా పట్టనివ్వదు. కాబట్టి పిల్లలకు నిద్రపోయే ముందు కాకుండా ఒక గంట ముందు పాలు తాగించడం ఆరోగ్యానికి మంచిది.
Read Also: మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్.. ఓ మహిళకు అరుదైన వ్యాధి
దంతాల సమస్యలు
నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే కొందరు పాలలో చక్కెర వేస్తారు. పాలలో ఉండే ఈ సహజ చక్కెర దంతాలను నాశనం చేస్తుంది. దీనివల్ల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడి.. దంతాలు కుళ్లిపోతాయి. దీంతో దంతాలు నొప్పిగా మారుతాయి. కొన్నిసార్లు దంతాలు మార్చాల్సి కూడా వస్తుంది.
నిద్రకు భంగం
రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు పాలు తాగాలి. అంతే కానీ నిద్రపోవడానికి ముందు పాలు తాగితే.. నిద్రకు భంగం కలుగుతుంది. అయితే సహజంగానే పాలలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల పిల్లలకు నిద్రపట్టడం కష్టం. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి నిద్రపోవడానికి ఒక అరగంట లేదా గంట ముందు పాలు పెట్టడం ఆరోగ్యానికి మంచిది.
జలుబు
పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే మాత్రం పాలు ఇవ్వవద్దు. వీటివల్ల పిల్లలు రాత్రిపూట టాయిలెట్ వెళ్లే అవకాశం ఉంది. కొందరు పాలలో పౌడర్, పంచదార వంటివి కలిపి ఇస్తారు. వీటివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: పెళ్లయిన తర్వాత విడాకులకు కారణాలు ఇవేనా?
ఏ సమయంలో ఇవ్వాలంటే..
పిల్లలకు పాలు రాత్రి సమయాల్లో కంటే ఉదయం ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం సమయాల్లో కూడా పిల్లలకు పాలు తాగించడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి పిల్లలకు రాత్రి నిద్రపోవడానికి గంట ముందు, ఉదయం, సాయంత్రం సమయాల్లో పాలు తాగిస్తే ప్రయోజనాలు ఉంటాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
-
Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
-
Couples: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ