Bulletproof Coffee: బుల్లెట్ ప్రూఫ్ కాపీ అంటే ఏమిటి? ఎందుకు ఇది వైరల్ గా మారింది? ఇది శరీరానికి మంచిదా? చేటు చేస్తుందా?

Bulletproof Coffee: ప్రస్తుతం కొన్ని విషయాలు రాత్రికి రాత్రి వైరల్ గా అవుతుంటాయి. వాటిని ప్రజలు పాటిస్తుంటారు కూడా. కొందరు ఆలోచిస్తే కొందరు మాత్రం వెంటనే పాటించడం అలవాటు చేసుకుంటారు. ఇక ప్రస్తుతం బరువు అనే సమస్య చాలా మందిలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకే బరువు తగ్గడానికి చాలా కఠినమైన చిట్కాలను చూసి వాటిని కూడా పాటిస్తున్నారు కొందరు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బుల్లెట్ కాఫీ అంటే మీరు తాగే టీ లేదా కాఫీ లో నెయ్యి కలపాలి. అంటే బ్లాక్ కాఫీకి నెయ్యి లేదా వెన్న కలిపి తయారు చేస్తారు. దీన్నే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని అంటున్నారు. కొంతమంది దీనిని బుల్లెట్ కాఫీ అని కూడా పిలుస్తారు. సోషల్ మీడియాలో, దీనిని కీటోజెనిసిస్ అంటారు. పేరు ఏది పిలిచినా సరే బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది అని నమ్మేవారు చాలా ఎక్కువ. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందామా.
ఊబకాయం – కొలెస్ట్రాల్?
వ్యాయామానికి ముందు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల శక్తి వస్తుంది అంటున్నారు నిపుణులు.అయితే బ్లాక్ కాఫీలో నెయ్యి లేదా వెన్న యాడ్ చేస్తే అది అధిక కొవ్వు పానీయంగా మారుతుంది. ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, ఉప్పు లేని వెన్న ఉంటుంది. మరి నెయ్యిని బరువు తగ్గడానికి ఉపయోగిస్తారా? అంటే ఈ ప్రశ్నకు నో అనే సమాధానం వినిపిస్తుంది. సో ఆరోగ్య నిపుణులు కూడా వెన్నతో కలిపిన కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదని చెబుతున్నారు. బదులుగా, ఇది అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందట. అందుకే ఎవరికీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని సిఫార్సు చేయమని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నెయ్యి పదార్థాలు బరువును పెంచుతాయి. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా బరువును పెంచే అవకాశం ఉంటుందట. కాబట్టి డయాబెటిక్ రోగులకు అస్సలు దీని జోలికి పోకూడదు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో విటమిన్ల లోపం కూడా ఉండవచ్చు.
గుండె జబ్బులు ఉన్నవారు పొరపాటున కూడా బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ సూక్ష్మపోషకాలు ఉంటాయి. అయితే బుల్లెట్‌ప్రూఫ్ కాఫీలో అధిక నాణ్యత గల కొవ్వు ఉంటుంది. కానీ దీనికి ఇతర రకాల సూక్ష్మపోషకాలు లేవు. కాబట్టి, అల్పాహారానికి బదులుగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎంచుకోవడం మాత్రం మానుకోవాలి. ఇక అల్పాహారంలో తృణధాన్యాలు, కూరగాయలు తీసుకుంటే మీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది కాకుండా ఆ బుల్లెట్ ప్రూఫ్ లాంటి టిఫిన్లు తీసుకుంటే మాత్రం మీకు చాలా ప్రమాదం. అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. భారతదేశంలో, ప్రజలు ఇప్పటికే నూనె, నెయ్యి, శుద్ధి చేసిన నూనె రూపంలో అనారోగ్యకరమైన కొవ్వులను వినియోగిస్తున్నారని ఎప్పటికప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అల్పాహారానికి బదులుగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకుంటే, అది చాలా హాని కలిగిస్తుంది. మీకు గుండె లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే, పొరపాటున కూడా బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకోవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.