Coffee: ఈ ఎనిమిది మంది కాఫీని అసలు తాగవద్దు.. చాలా డేంజర్

Coffee:
కాఫీ అంటే నచ్చని వారు ఉంటారా? ఉదయం టీ తాగే వారు ఎంత మంది ఉన్నారో అంత మంది కాఫీ లవర్స్ కూడా ఉన్నారు. కాఫీ అంటే కూడా చాలా మందికి ఇష్టమే. అయితే దీని వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటారు నిపుణులు. ప్రయోజనాలు మాత్రమే కాదు ఈ కాఫీ కొందరు తాగవద్దు కూడా. తాగితే దుష్ప్రభావాలు కూడా ఉంటాయట. మరి ఎవరు కాఫీని టచ్ చేయవద్దో తెలుసా?
గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు కాఫీ తాగకూడదు. కాఫీలో ఉండే కెఫిన్ జరాయువు ద్వారా శిశువుకు చేరుతుంది. ఇది గర్భస్రావం, అకాల ప్రసవానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుట్టడం కూడా జరగవచ్చు. సో గర్భిణీ స్త్రీలు కెఫిన్‌కు దూరంగా ఉండటం మంచిది.
గుండె జబ్బులు: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కాఫీ తాగడం మానేయాలి. కెఫిన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్తపోటును కూడా పెంచుతుంది. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. హృదయ స్పందన సక్రమంగా మారవచ్చు. మీకు అధిక రక్తపోటు లేదా ఇతర గుండె జబ్బులు ఉంటే, కాఫీ తాగే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు
నిద్రలేమి లేదా నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు కాఫీ తాగడం మానేయాలి. కెఫీన్ ఒక ఉద్దీపన. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెదడును సక్రియం చేస్తుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే , సాయంత్రం లేదా రాత్రి కాఫీ తాగడం మానుకోండి.
ఆందోళన లేదా ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు: ఆందోళన లేదా ఒత్తిడితో బాధపడేవారు పరిమితంగా మాత్రమే కాఫీ తాగాలి. కెఫిన్ అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఆందోళన, భయాన్ని పెంచుతుంది. మీకు ఆందోళన రుగ్మత ఉంటే, కాఫీ తాగడం వల్ల మీ పరిస్థితి మరింత దెబ్బతింటుంది.
కడుపు సమస్యలు: కాఫీ కడుపులోని ఆమ్లత్వాన్ని, గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచుతుంది. అల్సర్లు, గ్యాస్ట్రిటిస్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కడుపు నొప్పి, గుండెల్లో మంటను కలిగిస్తుంది.
ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్న వ్యక్తులు: ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు బలహీనంగా మారే ఒక పరిస్థితి . కెఫిన్ శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీకు ఆస్టియోపోరోసిస్ ఉంటే, కాఫీని కాస్త తక్కువ తాగండి. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
మందులు : కొన్ని మందులు కెఫిన్‌తో సంకర్షణ చెందుతాయి. మీరు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు లేదా మానసిక ఆరోగ్య సంబంధిత మందులు తీసుకుంటుంటే, కాఫీ తాగే ముందు వైద్యుడిని సంప్రదించండి. కెఫీన్ మందుల ప్రభావాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
పిల్లలు – యువకులు: పిల్లలు, టీనేజర్లు కాఫీ తాగడం మానుకోవాలి. వారి శరీరం కెఫీన్ కు ఎక్కువ సున్నితంగా ఉంటుంది. నిద్ర లేకపోవడం, చిరాకు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. వీటిని మరింత పెంచుతుంది కెఫెన్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.