Coconut Oil: కొబ్బరి నూనె వల్ల చర్మం నల్లగా మారుతుందా? ఇందులో నిజం ఎంత?

Coconut Oil:
చాలా మంది ఇప్పటికీ కూడా కొబ్బరి నూనెనే ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని కొబ్బరి నూనెకే ఎక్కువ ఓటు వేస్తారు ప్రజలు. చర్మం నుంచి వెంట్రుకల వరకు అన్నింటికి ఇది సహాయం చేస్తుందని నమ్మేవారే ఎక్కువ. ఏ నూనెలు కూడా వద్దని దీన్ని కొనుగోలు చేసేవారే ఎక్కువ. అయితే నిజంగానే దీనికి అంత సీన్ ఉందా అంటే అవును ఉంది అంటారు నిపుణులు. అయితే కొందరు మాత్రం కొబ్బరి నూనె వల్ల చర్మం నల్లగా మారుతుంది అని కూడా నమ్ముతారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలుసుకుందాం.
మాయిశ్చరైజర్ కోసం ఏవేవో ప్రాడెక్ట్స్ వాడుతారా? మీరు కానీ ఒక్క కొబ్బరి నూనె చాలండీ బాబు. ఇందులో మాయిశ్చరైజర్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. చర్మాన్ని పొడిబారనివ్వదు. దురద రానివ్వదు. టోటల్ ఆరోగ్యానికి ఉపయోగం ఇది. సాధారణంగా ప్రజలు సహజ చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే? కొందరు ఈ కొబ్బరి నూనె వల్ల చర్మం బ్లాక్ అవుతుంది అని నమ్ముతున్నారు. ఇది నిజమా అంటే? కొబ్బరిలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి.
కొబ్బరి నూనె చర్మాన్ని నల్లగా మారుస్తుందని చాలా మంది చెప్తుంటారు. ఇందులో అసలు నిజం లేదు అంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం తేమను కాపాడుకోవడానికి, చర్మంపై ఉన్న మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకానీ రంగు మాత్రం మారదు. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలను ఉండే కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది.
కొబ్బరినూనెను చర్మంపై పూయడం వల్ల మొటిమలు, సెల్యులైటిస్, ఫోలిక్యులిటిస్, అథ్లెట్స్ ఫుట్, బ్యాక్టీరియా లేదా ఫంగస్ సమస్యలు దూరం అవుతాయి. కొబ్బరి నూనెను నేరుగా చర్మానికి పూస్తే సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపవచ్చు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది.
ఇంతకీ ఇది ఎలా తయారు అవుతుంది?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, కొబ్బరి నూనె అనేది అత్యంత సంతృప్త నూనె. దీనిని సాంప్రదాయకంగా లేత కొబ్బరికాయలు లేదా ఎండిన కొబ్బరి గింజల నుంచి నూనెను తయారు చేస్తారు. గది ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలో ఉంటుంది కానీ, వేడిచేసినప్పుడు మృదువుగా మారుతుంది. దీన్ని చర్మం, జుట్టుకు రెండింటికి ఉపయోగించవచ్చు.
1. సహజ మాయిశ్చరైజర్
కొబ్బరి నూనె ఒక గొప్ప సహజ మాయిశ్చరైజర్. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి మరింత ఉపయోగం. దీని మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
2. వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలు: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొబ్బరి నూనె చర్మంపై కనిపించే సన్నని గీతలను తగ్గిస్తుంది. చర్మంపై ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ సమస్యను పరిష్కరిస్తుంది. గీతలు, ముడతలను తగ్గిస్తుంది.
3. చర్మపు చికాకు: UV కిరణాలతో పాటు, తామర లేదా చర్మశోథ వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, కొబ్బరి నూనెను ఉపయోగించాలి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎరుపు, వాపు లేదా దురద ను తగ్గిస్తుంది.
కొబ్బరి నూనెలో కామెడోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు దీన్ని ఎక్కువ వాడవద్దు. దీనిని సన్‌స్క్రీన్‌గా ఉపయోగించకూడదు. నిజానికి, అది సూర్యకిరణాలను తాకిన వెంటనే, అది కరుగుతుంది. సో మీకు మైనస్. ఇందులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. సో అన్ని స్కిన్ లకు సెట్ కాదు. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించండి.