Health Tips: వంటలకు కొబ్బరి, వేరుశెనగ.. రెండింటిలో ఏది బెటర్?

Health Tips: నూనె లేకపోతే అసలు కూరలు వండటం కష్టం. రుచికరమైన వంటలు తయారు కావడానికి తప్పకుండా నూనె ఉండాలి. అయితే ఎక్కువగా శాతం మంది సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వంటలకు ఉపయోగిస్తారు. కొందరు ఆరోగ్య పరంగా భావించిన వారు వేరుశెనగ లేదా కొబ్బరి నూనె వాడుతారు. నిజానికి కేరళ వాళ్లు ఎక్కువగా వంటలకు కొబ్బరి నూనెను వాడుతారు. మిగతా వాళ్లు పెద్దగా వాడరు. కాకపోతే ఎవరైతే హెల్తీ భావిస్తారో వారే కొబ్బరి నూనెను వాడుతారు. అయితే వంటల్లోకి కొబ్బరి, వేరుశెనగలో ఏ నూనె బెటర్? రెండింటిలో ఏ నూనెతో చేసిన వంటలు తింటే ఆరోగ్యానికి మంచిది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
కొబ్బరి పీచులో సంతృప్త కొవ్వులు, మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం కావడంతో పాటు బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చర్మం తేమగా ఉండటంతో పాటు మెరిసేలా చేస్తుంది. కొబ్బరి నూనెలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. జట్టు రాలిపోకుండా దృఢంగా పెరిగేలా చేస్తుంది. అయితే ఈ కొబ్బరి నూనె వంటలు తినడం మంచిదే. కానీ లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే.. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేరుశనగ నూనెలో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అయితే ఈ నూనె ఆరోగ్యానికి మంచిదే. అందరూ దీన్ని తీసుకోకూడదు.
వేరుశెనగ అలెర్జీ సమస్య ఉన్నవారు చిన్న ముక్క వేరుశెనగ తీసుకున్నా కూడా ప్రమాదమే. వెంటనే మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు తప్ప అందరూ కూడా వేరుశెనగ నూనెను లిమిట్‌లో ఉపయోగిస్తే మంచిదే. ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఏ పదార్థాన్ని కూడా ఎక్కువగా వాడకూడదు. దేన్ని అయినా కూడా లిమిట్‌లో వాడితేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. మరీ ఎక్కువగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటిలో పోషకాలు ఉన్నాయి. కాకపోతే మీ అనారోగ్య సమస్యల బట్టి డాక్టర్‌ను సంప్రదించి మీరు ఈ రెండింటిలో ఒక నూనెను తీసుకోవచ్చు. అయితే కొబ్బరి నూనెతో చేసిన వంటలను కొందరు పెద్దగా ఇష్టపెట్టుకోరు. అయితే మార్కెట్‌లో లభ్యమయ్యే ఆయిల్స్ కాకుండా సహజంగా గానుగ దగ్గర లభించే నూనెలను తీసుకోండి. ఎందుకంటే వీటిలో ఎలాంటి కల్తీ కూడా ఉండదు. ఇలాంటి నూనెలతో చేసిన వంటలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Cooking Oil: వంటల్లో నూనెను తగ్గించేందుకు చిట్కాలివే
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?