Eggs: వేసవిలో గుడ్లు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Eggs వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. వీటితో పాటు ముఖంపై మచ్చలు రావడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు అన్ని వస్తాయి.

Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. చాలా మంది గుడ్లు రోజూ ఉదయం ఉడికించి తీసుకుంటారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే.. వేసవిలో ఎక్కువగా గుడ్లు ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గుడ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ వేసవిలో ఎక్కువగా తింటే బాడీకి వేడి చేస్తుందని నిపుణులు అంటున్నారు. మిగతా సీజన్‌లో ఎక్కువగా వీటిని తింటే ఏం కాదు. కానీ ఈ సీజన్‌లో కేవలం మోతాదులో మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసవిలో ఎక్కువగా గుడ్లు తింటే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వేడి పెరుగుతుంది
వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. వీటితో పాటు ముఖంపై మచ్చలు రావడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు అన్ని వస్తాయి. వీటివల్ల ఇంకా చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి వేసవిలో ఎక్కువగా గుడ్లు తినవద్దు.
జీర్ణ సమస్యలు
వేసవిలో ఎక్కువగా గుడ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వేసవిలో తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ పెరుగుతుంది
ఎక్కువగా గుడ్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల మీరు లావు కూడా అయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇంకా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా గుడ్లు వేసవిలో తీసుకోవద్దు.
మధుమేహం
ఈ సమస్య ఉన్నవారు అయితే వేసవిలో అసలు గుడ్లు తీసుకోకూడదు. దీనివల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవిలో ఎక్కువగా గుడ్లు తీసుకోవద్దు. ఇందులోని ప్రొటీన్ ఆరోగ్యానికి మంచిదే. కానీ వేసవిలో ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అందులోనూ గుడ్డులోని పచ్చ సొన అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంకా వేడి పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి వేసవిలో ఎక్కువగా గుడ్లు తీసుకోవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.