Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Egg Less Chocolate Chip Cookies At Home Simple Recipe

Chip Cookies : మార్కెట్ కుకీల కంటే రుచిగా ఇంట్లోనే ఎగ్ లెస్ చాక్లెట్ చిప్ కుకీస్.. ఎలా చేసుకోవాలంటే ?

Chip Cookies : మార్కెట్ కుకీల కంటే రుచిగా ఇంట్లోనే ఎగ్ లెస్ చాక్లెట్ చిప్ కుకీస్.. ఎలా చేసుకోవాలంటే ?
  • Edited By: rocky,
  • Updated on June 11, 2025 / 08:16 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Chip Cookies : పిల్లలైనా, పెద్దలైనా… చాలా మందికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ బిస్కెట్లైనా, కేకులైనా వాటి రుచి అదిరిపోతుంది. అయితే, మార్కెట్లో దొరికే చాలా కుకీస్‌లో గుడ్డు కలిపి ఉంటుంది. దీంతో గుడ్డు తినని వాళ్లు వాటిని తినేందుకు ఇష్టపడరు. ఒకవేళ మీరు కూడా బేకరీల్లో దొరికే టేస్టీ, క్రిస్పీ చాక్లెట్ చిప్ కుకీస్‌ను ఇష్టపడేవారైతే వాటిని పదేపదే కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వాటిని ఇంట్లోనే, గుడ్డు లేకుండా, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసిన కుకీస్ రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా మంచివి.

చాక్లెట్ చిప్ కుకీస్
చాక్లెట్ చిప్ కుకీస్ పేరు వినగానే నోరూరిపోతుంది కదూ. ఇవి మీ తీపి తినాలనే కోరికను తీర్చడమే కాకుండా మీ మూడ్‌ను కూడా ఇట్టే మార్చేస్తాయి. మెత్తని పిండిలో చాక్లెట్ చిప్స్ తీయగా, క్రిస్పీగా కలిసిపోవడం వల్ల, ప్రతి ముద్దతో మీ మనసు ఆనందంతో మురిసిపోతుంది. సాయంత్రం టీతో వీటిని తినడం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

Read Also:Viral : పింక్ కలర్ కొబ్బరి బోండాం చూశారా.. దేవుడా ఇంకా ఎన్ని వింతలు చూడాలో !

చాక్లెట్ చిప్ కుకీస్ తయారు చేయడానికి కావలసినవి
చాక్లెట్ చిప్ కుకీస్‌ను ఇంట్లో తయారు చేయడం చాలా సులభం. మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతో గుడ్డు లేకుండానే వీటిని తయారు చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవే:
* చాక్లెట్ (Chocolate)
* బటర్ (Butter)
* చక్కెర (White Sugar)
* బ్రౌన్ షుగర్ (Brown Sugar)
* పాలు (Milk)
* వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ (Vanilla Extract)
* బేకింగ్ సోడా (Baking Soda)
* బేకింగ్ పౌడర్ (Baking Powder)
* మైదా పిండి (All-Purpose Flour)

చాక్లెట్ చిప్ కుకీస్ ఎలా తయారు చేయాలి?
స్టెప్ 1 : ముందుగా ఒక గిన్నెలో బటర్, చక్కెర (తెల్ల చక్కెర, బ్రౌన్ షుగర్) వేసి బాగా కలపాలి. ఇది తేలికగా మెత్తగా అయ్యే వరకు కలపాలి.
స్టెప్ 2 : ఇప్పుడు ఇందులో పాలు, వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి బాగా కలపాలి.
స్టెప్ 3 : మరో గిన్నెలో జల్లెడ సహాయంతో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మిశ్రమాన్ని మొదటి గిన్నెలోని బటర్ మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ, మెత్తని పిండి తయారు చేసుకోవాలి. పిండిని ఎక్కువగా కలపకూడదు, జస్ట్ అంతా కలిసిపోయే వరకు కలిపితే చాలు.

Read Also:Pournami: వెరీ పవర్‌ఫుల్ పౌర్ణమి.. ఈ నియమాలు పాటిస్తే విజయం తథ్యం

స్టెప్ 4 : కొన్ని చాక్లెట్ చిప్స్‌ను ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. వీటిని మీరు కుకీల పైన డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు. పిండిలో కూడా మీకు నచ్చినన్ని చాక్లెట్ చిప్స్ వేసి కలుపుకోవచ్చు.
స్టెప్ 5: ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టి సెట్ అవ్వనివ్వాలి. దీనివల్ల కుకీస్ బాగా వస్తాయి.
స్టెప్ 6: ఫ్రిజ్ నుంచి తీసిన పిండితో చిన్న చిన్న బాల్స్ తయారు చేయండి. వీటి పైన మీరు ముందుగా పక్కన పెట్టుకున్న చాక్లెట్ చిప్స్‌ను అద్దండి. మీకు ఇంకా ఎక్కువ చాక్లెటీగా కావాలంటే, పిండి బాల్‌కి చాక్లెట్ సిరప్ రాసి, దాన్ని మరో పిండి బాల్‌తో కవర్ చేయవచ్చు.

ఇప్పుడు ఈ కుకీ బాల్స్‌ను బేకింగ్ ట్రే పై పెట్టి, ముందుగా ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో లేదా తగిన విధంగా కుకీలను బేక్ చేయండి. కుకీలు చల్లబడిన తర్వాత వాటిని గాలి లేని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అవి మరింత రుచికరంగా మారతాయి. ఇవి కనీసం ఒక వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారు. ఈ సులభమైన రెసిపీతో ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన చాక్లెట్ చిప్ కుకీస్‌ను తయారు చేసుకోండి.

Tag

  • Chocolate Chip Cookies
  • Dessert Recipe
  • Easy Baking
  • Eggless Recipe
  • Homemade Cookies
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us