Pournami: వెరీ పవర్‌ఫుల్ పౌర్ణమి.. ఈ నియమాలు పాటిస్తే విజయం తథ్యం

Pournami: హిందూ మతంలో జ్యేష్ఠ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. ఈ పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన, ఉతికిన దుస్తులను ధరించాలి. ఆ తర్వాతే పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం కూడా చాలా మంచిది. ఈ వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. అలాగే పౌర్ణమి నాడు ప్రవహించే నదిలో స్నానం చేయడం వలన గత జన్మ పాపాలు కూడా తొలగిపోయి. జీవితంలో సంతోషంగా ఉండవచ్చని పురాణాలు చెబుతున్నాయి. నదులకు వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకుని స్నానం చేయవచ్చని పండితులు అంటున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. రావి చెట్టులో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, శివుడు) కొలువై ఉంటారని నమ్మకం. ఈ విధంగా రావి చెట్టును పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలగడంతో పాటు జీవితంలోని కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తిథి పంచాంగం ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 10వ తేదీన ఉదయం 11:35 గంటలకు ప్రారంభమై జూన్ 11వ తేదీన మధ్యాహ్నం 1:13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో పూజలు నిర్వహించడం చాలా మంచిదని పండితులు అంటున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారం, బట్టలు, ధాన్యం వంటి వాటిని అవసరమైన వారికి దానం చేయవచ్చు. పేదలకు సహాయం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయని పండితులు అంటున్నారు. దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం లేదా ఆలయ నిర్మాణ పనులకు సహాయం చేయడం కూడా ఈ రోజున చాలా పుణ్య కార్యంగా భావిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం