Eye Health: కళ్ల ఆరోగ్యం కోసం చిన్ని చిట్కాలు.. పాటిస్తేనే లేకపోతే మీకు కళ్ల జోడు దిక్కే

Eye Health: ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్ వంటివి చూస్తున్నారు. సమయం తెలియకుండా గంటల తరబడి వాటిని చూస్తున్నారు. వీటివల్ల చాలా మంది కంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అయితే కళ్లు అనేవి మనిషికి చాలా ముఖ్యం. ఈ ప్రపంచాన్ని చూడాలంటే తప్పకుండా కళ్లు ఆరోగ్యంగా ఉండాలి. సరిగ్గా నిద్రలేకపోవడం, ఎక్కువగా ఇలాంటివి చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మాత్రం తప్పకుండా కళ్ల జోడు పెట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు తీసుకోవాలో మరి ఈ స్టోరీలో చూద్దాం.
కీరాదోస
కళ్లకు కీరాదోస బాగా పనిచేస్తుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసి కళ్ల కింద అప్పుడప్పుడు పెట్టడం వల్ల చల్లగా ఉంటుంది. అయితే కీరాను కట్ చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. చల్లగా మారిన తర్వాత కూడా కళ్ల కింద పెట్టుకోవచ్చు. ఇలా ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుంది. కళ్లపై ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ముఖ్యంగా కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు అయితే మారిపోతాయి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ కళ్లు ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే కొందరు దీనికి బదులు యాపిల్‌ను కూడా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కంటి సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
బంగాళా దుంప రసం
బంగాళ దుంపలను తొక్క తీసి కోయాలి. దీనిని పేస్ట్ చేయగా వచ్చిన రసంలో దూది ముంచి కళ్ల కింద అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన ఒక 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల కళ్లకు సరిగ్గా రక్తప్రసరణ కూడా జరుగుతుంది. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు కూడా రావు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి కళ్ల సమస్యలు అయినా కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు.
రోజ్‌వాటర్
రోజ్ వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్ల వాపు, అలసట అన్ని కూడా తగ్గుతాయి. అలాగే కళ్ల అలసట తగ్గుతుంది. కంటి సమస్యలు రాకుండా ఎక్కువ రోజులు కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
బేబీ ఆయిల్
బేబీ ఆయిల్‌లో గోరు వెచ్చని నీరు వేయాలి. బాగా కలిపి ఇందులో ముంచిన దూదిని 20 నిమిషాల పాటు కళ్ల కింద ఉంచాలి. దీనివల్ల కళ్లు సాధారణంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు