Gastric Problem: తిన్న తర్వాత ఇలా చేయండి గ్యాస్, ఉబ్బరం రావు బ్రో..

Gastric Problem:
తినే ఆరోగ్యం మాత్రమే బెటర్ గా ఉంటే సరిపోదు. తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండోయ్. లేదంటే బారెడు పొట్టలో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిందే. ఇక కొందరి అలవాట్లు చూస్తే వామ్మో వీళ్లేంటిరా బాబూ మరీ ఈ రేంజ్ లో ఉన్నారు అని అనాలి అనిపిస్తుంది. కానీ నిజంగా మొహం మీద అనేస్తామా ఏంటి? అన్నం తిన్న తర్వాత పొట్టలో ఏదైనా ఖాళీ ఉంటుంది కావచ్చు ఏదో ఏదో తింటుంటారు.
ఆహారం తిన్న తర్వాత వెంటనే పడుకోవడ, పొగ తాగడం, స్నానం చేయడం, పండ్లు, వ్యాయామ చేయడం మానేయాలి. మరీ ముఖ్యంగా ఆ టీ, కాఫీలు అసలు తీసుకోవద్దు. లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఇవి. ఇక తిన్న తర్వాత కొన్ని అలవాట్లు చేసుకుంటే మీ పొట్టలో ఉబ్బరం, గ్యాస్ సమస్య రమ్మన్నా రావు. మరి ఏం చేయాలంటే?
వజ్రాసనము: ఇప్పుడు మకు ఒక మాయా ఆసనం చెప్పాలా? అదేనండీ వజ్రాసనం వేయాలి. తిన్న తర్వాత ఈ ఆసనం చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రావు. దీని కోసం మీ రెండు మోకాళ్లను వంచి వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇలా చేస్తే శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా జరుగుతుంది.
నడవాలి:తిన్న తర్వాత పరుగులు తీయడం లేదా ఓ తెగ స్పీడ్ గా నడవడం అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా కాసేపు నడిస్తే సరిపోతుంది. మీరు తిన్న తర్వాత (15 నుండి 20 నిమిషాలు) కొద్దిసేపు నడిచినా, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
పళ్ళు తోముకో బాస్.
తిన్న తర్వాత పళ్లు తోముకుంటే మీ దంతాలలో ఇరుక్కున్న మురికి పోతుంది. ఆ తర్వాత ఇతర ఆహారాలను తినవద్దు అని కూడా తెలుస్తుంది. చిప్స్, చాక్లెట్స్ వంటివి ఏవి కూడా తినరు. సో మంచి అలవాటు కదా.
సోంపు తినండి: సోంపు యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ లను కలిగి ఉంటుంది. ఇది ఆహారంలో ఎక్కువ భాగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉన్న నీటిని గ్రహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, తిన్న తర్వాత సోంపును నమిలిన తర్వాత మాత్రమే తినాలి.
ఎడమ వైపు పడుకోండి
పడుకునేటప్పుడు కూడా కాస్త ఎడమ వైపు తిరిగి పడుకోండి. దీని వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆమ్లత్వం, గుండెల్లో మంటను నివారిస్తుంది. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. సో టేక్ కేర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.