How to Grow a Full Beard: మీకు గడ్డం లేదని బాధపడుతున్నారా? ఇలా చేయండి ఫుల్ గా గడ్డం వస్తుంది
How to Grow a Full Beard: నేటి కాలంలో, పురుషులు తమ గడ్డం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందులో మీరు కూడా ఉన్నారా బ్రదర్. మరి ఉండరా? యువత నుంచి వృద్ధుల వరకు గడ్డం లుక్ చాలా ట్రెండీగా మారింది కదా. సినిమా తారల నుంచి సామాన్యుల వరకు గడ్డం క్రేజ్ చాలా వేగంగా పెరిగింది.

How to Grow a Full Beard: హలో బ్రదర్స్ హాయ్. మీకోసం ఇప్పుడు ఒక సూపర్ టాపిక్ తీసుకొని వచ్చాను. మీకు గడ్డం సరిగ్గా లేదా? అయ్యో డోన్ట్ వర్రీ బ్రదర్. ఎందుకు టెన్షన్ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చదివి కాస్త ఫ్రీ అయిపోదాం. మనసు కాస్త ఫ్రీ కూడా అవుతుంది. ఎందుకంటే నేటి కాలంలో, పురుషులు తమ గడ్డం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందులో మీరు కూడా ఉన్నారా బ్రదర్. మరి ఉండరా? యువత నుంచి వృద్ధుల వరకు గడ్డం లుక్ చాలా ట్రెండీగా మారింది కదా. సినిమా తారల నుంచి సామాన్యుల వరకు గడ్డం క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. మందపాటి గడ్డం రాని వారు ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు. శరీరంలో హార్మోన్లు లేకపోవడం వల్ల గడ్డం వెంట్రుకలు పెరగవు. టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల గడ్డం మరియు శరీర వెంట్రుకలు ఎక్కువ లేదా తక్కువ పెరుగుతాయి. కానీ గడ్డం మందంగా, ట్రెండీగా లేని వ్యక్తులు తరచుగా గడ్డం పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా గడ్డం లేదని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే టెన్షన్ ఎందుకు ఈ ఆర్టికల్ చదివేసేయండి.
దాల్చిన చెక్క పొడి, నిమ్మకాయ వాడితే మంచి గడ్డం పెరుగుతుంది. గడ్డం పెరగడానికి దాల్చిన చెక్క, నిమ్మకాయను ఎలా ఉపయోగించాలో? దాని ప్రయోజనాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Viral Video : జస్ట్ మిస్ అంటే.. లేకపోతే పోతే ఇదే లాస్ట్ టూర్ అయ్యేది
మంచి, మందపాటి గడ్డం కోసం దాల్చిన చెక్క, నిమ్మకాయ వాడండి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల గడ్డం మందంగా, అందంగా కనిపిస్తాయి. దాల్చిన చెక్క, నిమ్మకాయలో ఉండే లక్షణాలు ముఖంపై ఉన్న రంధ్రాలను సక్రియం చేయడంలో సహాయపడతాయి. నిమ్మరసంతో కలిపిన దాల్చిన చెక్క పొడిని క్రమం తప్పకుండా గడ్డంపై పూయడం వల్ల గడ్డం వెంట్రుకలు పెరుగుతాయి. జుట్టు మందంగా మారుతుంది.”
గడ్డం వెంట్రుకలను చిక్కగా చేసి, దానికి పర్ఫెక్ట్ లుక్ ఇవ్వడానికి మీరు దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం ఉపయోగించవచ్చు. దీని కోసం, ముందుగా దాల్చిన చెక్క ముక్కలను తీసుకొని బాగా రుబ్బుకుని పౌడర్ తయారు చేసుకోండి. మీకు కావాలంటే, మీరు మార్కెట్ నుంచి దాల్చిన చెక్క పొడిని కూడా కొనుగోలు చేయవచ్చు. 2 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి బాగా కలపండి. దీని తర్వాత, ఈ పేస్ట్‌ను 2 నుంచి 3 నిమిషాలు కలపండి. ఇప్పుడు మీ పేస్ట్ సిద్ధంగా ఉంది. ఈ పేస్ట్‌ను జుట్టు తక్కువగా ఉన్న గడ్డంపై బాగా అప్లై చేయండి. దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ముఖం బాగా కడుక్కోండి.
Also Read: Isn’t it the real ORS: వామ్మో.. ఇది అసలైన ఓఆర్ఎస్ కాదా? మరేం కొనాలి?
దాల్చిన చెక్క, నిమ్మరసం పూయడం వల్ల ముఖం రంధ్రాలు తెరుచుకుంటాయి. కణాలలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ గడ్డం పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. కానీ కచ్చితంగా మీరు దీన్ని ఉపయోగించే ముందు కాస్త ప్చాచ్ టెస్ట్ చేసుకోండి బ్రదర్స్ మీకు ఏదైనా రకమైన అలెర్జీ ఉంటే, వైద్యుడిని సంప్రదించకుండా దీనిని వాడకుండా ఉండండి. ఈ పేస్ట్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.