Bananas: అరటి పండ్లు నల్లగా మారకుండా ఉండాలంటే?
Bananas అరటి పండ్లు పాడవుకుండా ఉండాలంటే వాటి కాడలను అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టండి. అరటి పండ్లు కాడలకు వీటిని పెడితే వారం రోజులు అయినా కూడా అవి నల్లగా మారవు.

Bananas: అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని తింటుంటారు. ఇవి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా డైలీ ఉదయం వీటిని తింటుంటారు. వీటిని తినడం వల్ల రోజంతా యాక్టి్వ్‌గా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అయితే వీటిని కొందరు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకుంటారు. మరికొందరు వీటిని వారానికి సరిపడా తెచ్చుకుని ఉంచుకుంటారు. కానీ ఇవి ఒక రెండు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత నల్లగా మారిపోతుంటాయి. ఎంత కాయలు వంటివి తీసుకొచ్చినా కూడా అరటి పండ్లు నల్లగా మారిపోతాయి. ఇలా నల్లగా మారిపోతే కొందరికి తినడం ఇష్టం ఉండదు. దీంతో వాటిని పడేస్తారు. అయితే అరటి పండ్లు నల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అల్యూమినియం ఫాయిల్
అరటి పండ్లు పాడవుకుండా ఉండాలంటే వాటి కాడలను అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టండి. అరటి పండ్లు కాడలకు వీటిని పెడితే వారం రోజులు అయినా కూడా అవి నల్లగా మారవు. మీకు అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ప్లాస్టక్ లేదా కాగితం పెట్టండి. ఇలా చేస్తే అరటి పండ్లు నల్లగా మారకుండా తాజాగా ఉంటాయి.
వేలాడదీయండి
చాలా మంది అరటి పండ్లను ఫిడ్జ్‌లో పెడుతుంటారు. అలాగే గాలి తగలని ఒక పాత్రలో పెడుతుంటారు. ఇలా కాకుండా పండ్లను గాలిలో వేలాడదీస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీ ఇంటిలో ఏదైనా తాడుకి అరటి పండ్లను వేలాడదీస్తే వారం రోజులు అయినా కూడా పాడవుకుండా ఉంటాయి.
ఇతర పండ్లతో ఉంచవద్దు
పండ్లను చాలా మంది అన్ని కలిపి ఒకే దగ్గర ఉంచుతారు. ఇలా అన్ని పండ్లతో అరటి పండ్లను పెట్టవద్దు. అరటి పండ్లను ఇలా కలిపి ఉంచితే అవి పాడవుతాయి. తొందరగా నల్లగా మారిపోతాయి. అరటి పండ్లను సపరేట్‌గా ఉంచాలి. ముఖ్యంగా ఆపిల్, టమోటాలతో అయితే అసలు ఉంచకూడదు. వీటితో ఉంచడం వల్ల పండ్లు తొందరగా నల్లగా మారిపోతాయి.
ఫ్రిజ్‌లో పెట్టవద్దు
అరటి పండ్లను కొందరు ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల అవి తొందరగా పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉంచడమే కరెక్ట్ అని నిపుణులు అంటున్నారు. ఫ్రిజ్ అనువైన ప్రదేశం కాదు. చల్లగా ఉండటం వల్ల పండు పాడైపోతుంది. ఫ్రిజ్ లో ఉంచడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడమే అన్ని విధాలా మంచిది.
స్మూతీలు
అరటి పండ్లు నల్లగా మారితే వాటిని తినడం ఇష్టం లేకపోతే పడేయవద్దు. వాటితో స్మూతీలు, మఫిన్లు, బ్రెడ్ వంటివి చేసుకోవచ్చు. అరటి పండుతో కేక్‌లు కూడా చేసుకోవచ్చు. పిల్లలు అయితే వీటిని ఇష్టంగా తింటారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.