Silver Ring: వెండి ఉంగరాన్ని ఈ వేలికి ధరిస్తే.. మీకు అదృష్టమే అదృష్టం
Silver Ring వెండి ఉంగరాన్ని బొటన వేలుకు ధరించడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. ఎంతటి కష్టమైన పనులు కూడా సానుకూలంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లభిస్తుంది. బొ

Silver Ring: ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని చాలా మంది భావిస్తారు. కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలని అనుకుంటారు. కొన్నిసార్లు ఎన్ని కష్టాలను తట్టుకున్నా కూడా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఆ సమస్యలు తీరిపోవు. ప్రస్తుతం రోజుల్లో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో చాలా మంది ఎక్కువగా బాధపడుతున్నారు. దీంతో అసలు వారి జీవితంలో మానసిక ప్రశాంతత ఉండదు. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు మరిచిపోవాలనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మాత్రం వెండి ఉంగరాన్ని ఓ వేలికి ధరించాలని పండితులు చెబుతున్నారు. ఏ వేలికి ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
వెండి ఉంగరాన్ని బొటన వేలుకు ధరించడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. ఎంతటి కష్టమైన పనులు కూడా సానుకూలంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లభిస్తుంది. బొటన వేలికి వెండి ఉంగరం పెట్టడం వల్ల రాహువు, శని శక్తి లభిస్తుంది. మీ జీవితంలో జరిగే ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. అలాగే అన్ని సమస్యలను కూడా తగ్గిస్తుంది. అడ్డంకులను కూడా తొలగిస్తుంది. కొందరు ఎక్కువగా సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారు బొటన వేలుకి ఉంగరాన్ని ధరించడం వల్ల సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కొందరు ప్రేమలో విఫలం అవుతుంటారు. అలాంటి వారికి ఈ వెండి ఉంగరం బాగా పనిచేస్తుంది. వీటితో పాటు ఆర్థిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆర్థికంగా కూడా మెరుగుపడేలా చేస్తుంది. వెండికి, చంద్రుడికి అంతా కూడా మంచి జరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని విధాలుగా కూడా మంచి విషయాల్లోనే నిర్ణయాలు తీసుకుంటారు.
వెండి ఉంగరాన్ని బొటనవేలుకి ధరించడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా సోమవారం లేదా శుక్రవారం నాడు మాత్రమే వెండి ఉంగరాన్ని బొటనవేలుకి ధరించాలి. అప్పుడే మీకు ప్రయోజనాలు అందుతాయి. లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు కూడా అందవు. అయితే వెండి ఉంగరాన్ని బొటనవేలుకి ధరించే ముందు శుద్ధి చేయాలి. ఆ తర్వాతే మీరు ధరించాలి. మీరు పాలు లేదా గంగా జలంతో వెండి ఉంగరాన్ని కడిగిన తర్వాతే బొటనవేలుకి ధరించాలి. అప్పుడే మీకు దీనివల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు అంటున్నారు. అయితే కొందరి జాతకం ప్రకారం చూస్తే అందరికీ కూడా ఈ వెండి ఉంగరం బొటన వేలుకి సెట్ కాదు. మీరు బొటన వేలుకి వెండి ఉంగరం ధరించాలనుకుంటే మాత్రం ఒకసారి పండితులను సంప్రదించి.. ఆ తర్వాత ధరించడం ఉత్తమం. కాబట్టి మీరు వెండి ఉంగరాన్ని ధరించేటప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించడం బెటర్.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.