Silver Ring: ఈ వేలుకి వెండి ఉంగరం ధరిస్తే.. మీరు కోటీశ్వరులు కావడం పక్కా!

Silver Ring:
డబ్బు సంపాదించాలని ప్రతీ ఒక్కరికి కూడా ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. తమకి నచ్చిన వస్తువు ఎంత ధర ఉన్నా కూడా కొనగలిగే స్థోమత ఉండాలని ఎక్కువగా ఆశపడుతుంటారు. ఈ ప్రపంచంలోని అందరూ కూడా డబ్బు కోసమే కష్టపడుతున్నారు. దీనికోసం కొందరు కొన్ని వాస్తు నియమాలు కూడా పాటిస్తుంటారు. పండితులు దగ్గర అడిగించడం, ఏం చేస్తే డబ్బు వస్తుందని అడుగుతుంటారు. ఇలా చేస్తే డబ్బులు వస్తాయని పండితులు చెబితే.. అలానే ఆచరిస్తారు. పండితులు ఏవైనా నియమాలు పాటించడం లేదా మెడలో బిల్ల వేయండి, చేతికి ఉంగరం ధరించమని ఇలా ఎన్నో చెబుతుంటారు. ఈ క్రమంలో కొందరు కొన్ని రకాల ఉంగరాలను చేతి వేలుకి పెడుతుంటారు. కొందరు స్టైల్ కోసం ఉంగరాలు పెడితే మరికొందరు ఇలా డబ్బులు కలిసి వస్తాయని ధరిస్తారు. సాధారణంగా అన్ని వేళ్ల కంటే ఉంగరం వేలు, చూపుడు వేలుకి పెడుతుంటారు. కానీ చేతిలోని ఐదు వేళ్లలో బొటన వేలుకి వెండి ఉంగరం ధరిస్తే డబ్బు వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. మిగతా వేలుకి కాకుండా బొటన వేలుకి వెండి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
చంద్రుడు బలహీనంగా ఉన్నవాళ్లు
కొందరికి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. దీనివల్ల ఏ పని తలపెట్టినా కూడా జరగదు. ఉద్యోగం, వ్యాపారం, చదువు ఇలా అన్నింట్లో కూడా సమస్యలు ఎదుర్కుంటారు. ఇలాంటి వారు బొటనవేలుకి వెండి ఉంగరం ధరించడం వల్ల అన్నింటిల్లో కూడా విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం సిద్ధిస్తుంది.
ఒత్తిడి నుంచి విముక్తి
బొటనవేలుకి వెండి ఉంగరం ధరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి పొందుతారు. కొందరు ఎక్కువ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతీ చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు బొటనవేలుకి వెండి ఉంగరం ధరించడం వల్ల ఫలితాలు ఉంటాయి.
ఏకాగ్రత పెరగడం
వెండి ఉంగరం బొటనవేలుకి ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆందోళనల వల్ల దేని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేరు. దీంతో ఏ పని కూడా సక్రమంగా పనిచేయదు. ఈ వెండి ఉంగరం ధరిస్తే మీకు ఏకాగ్రత పెరుగుతుంది.
సంపద పెరగడం
బొటనవేలుకి వెండి ఉంగరం ధరించడం వల్ల సంపద పెరుగుతుంది. మీరు కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోయి సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఎలాంటి అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటుంది. కేవలం బొటనవేలుకి మాత్రమే వెండి ఉంగరం ధరించడం వల్ల ఇలా జరుగుతుంది.