Indians: ఇండియన్స్ ఉదయాన్నే ఎందుకు బాత్ చేస్తారు.. దీని వెనుక ఏదైనా సైన్స్ దాగుందా?

Indians:
ఉదయం స్నానం చేస్తే రోజంతా ఫ్రెష్‌గా ఉంటామని మన పెద్దలు చెబుతుంటారు. ఇండియాలో ప్రతీ ఒక్కరూ కూడా సీజన్‌తో సంబంధం లేకుండా ఉదయాన్నే స్నానం చేస్తారు. ఎన్నో వేల ఏళ్ల నుంచి ఇదే పద్ధతిని ఇండియాలో ఉన్న వారంతా పాటిస్తున్నారు. ఉదయం స్నానం చేస్తేనే ఆరోగ్యమని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే మన చుట్టూ ఉన్న దేశాలు మాత్రం ఉదయం కాకుండా సాయంత్రం, రాత్రి వేళ స్నానం చేస్తుంటారు. ఉదయం కంటే రాత్రి సమయాల్లో స్నానం చేయడమే మంచిదని అంటున్నారు. అయితే ఏ సమయంలో స్నానం చేయడం మంచిది? ఇండియాన్స్ ఉదయాన్నే స్నానం చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియాలో ఉదయం స్నానం చేసే అలవాటు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. జపాన్, కొరియా, చైనాలలో, రాత్రిపూట స్నానం చేసే అలవాటు కూడా పురాతన కాలం నుంచి ఉంది. అయితే రాత్రి సమయాల్లో స్నానం చేయడం వల్ల పగటిపూట శరీరంపై పేరుకుపోయిన విషపదార్థాలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నమ్ముతారు. అందుకే కొరియా, అమెరికా, యూరప్, కెనడా వంటి దేశాలు రాత్రి పూట స్నానం చేస్తాయి. అయితే ఎక్కువగా చైనీయులు రాత్రిపూట స్నానం చేస్తారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ప్రతికూల శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి. దీంతో పాటు రాత్రిపూట హాయిగా ఉంటుందని నమ్ముతారు. అలాగే శరీరంలో ఉండే అన్ని ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే మనస్సు కూడా శుద్ధి అవుతుందని చాలా దేశాల్లో రాత్రిపూటే స్నానం చేస్తారు. కానీ ఇండియన్స్ మాత్రం ఉదయం పూటే స్నానం చేస్తారు. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం స్నానం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నిద్రపోయినప్పుడు కూడా శరీరంపై మురికి ఉండిపోతుంది. దీని నుంచి విముక్తి పొందాలంటే లేచిన వెంటనే స్నానం చేయడం వల్ల ఆ మురికి అంతా కూడా పోతుంది. చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా చేరవు. దీనివల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఇండియన్స్ ఎక్కువగా ఉదయం పూట స్నానం ఆచరిస్తారు.
స్నానం చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు కూడా రావు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది. స్నానం చేయడం వల్ల మీకు తెలియకుండానే యాక్టివ్ అవుతారు. మానసిక సమస్యలు ఉండవు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఏ పనిని అయినా కూడా ఇంట్రెస్ట్‌తో చేయగలరు. చిరాకు, నీరసం అన్ని కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.