Kasi: ఈ కాశీలో స్నానాలు చేస్తే.. పాపాల నుంచి విముక్తి

Kasi: కాశీలో స్నానం చేస్తే పాపాలు అన్ని తొలగిపోతాయని చాలా మంది చెబుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా కూడా కాశీ వెళ్లాలని మన పెద్దలు అంటుంటారు. అయితే కాశీ అనేది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది. ఇక్కడికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ కాశీలో స్నానం చేస్తే.. పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే చాలా మంది కుమావున్ కాశీ గురించి పెద్దగా తెలియదు. ఈ కాశీలో స్నానం ఆచరిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని, పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని అంటున్నారు. వారణాసిలో ఉన్న కాశీలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో.. ఈ కాశీలో స్నానం చేసినా కూడా అలాంటి ఫలితమే వస్తుంది. అయితే ఈ కుమావున్ కాశీ ఎక్కడ ఉంది? ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాను కుమావున్ కాశీ అని అంటారు. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు స్నానం చేయడానికి వెళ్తుంటారు. అయితే ఈ కాశీకి ఓ పవిత్రమైన ఆచారం కూడా ఉంది. ఈ కాశీ గంగా, సరయు, గోమతి నదుల సంగమం దగ్గర తపస్సు చేస్తే మంచిదని నమ్ముతారు. అయితే ఈ జిల్లాను శివునికి అంకితం చేశారు. చాలా దూర ప్రాంతాల నుంచి శివుడిని పూజించడానికి ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. వారణాసిలో ఎలా మోక్షం కోసం పూజిస్తారో.. ఇక్కడ కూడా అంతే. మీరు ఇక్కడికి వెళ్లి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయని నమ్ము్తారు. అందుకే భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ స్నానం ఆచరించి పూజలు నిర్వహిస్తే మాత్రం అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని, కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేసుకుంటారు.
బాగేశ్వర్‌లోని త్రివేణి సంగమం ఘాట్ ఉంది. దీనికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ సంగమం ప్రయాగ్‌రాజ్, రిషికేశ్ తర్వాత మూడవ ప్రధాన త్రివేణి సంగమంగా భావిస్తారు. ఇక్కడ గంగా, సరయు, గోమతి నదులు కలుస్తాయి. ఇక్కడ స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు నశించి, వ్యక్తికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మకర సంక్రాంతి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తారు. బాగేశ్వర్ అనేది గొప్ప సన్యాసి మహర్షి మార్కండేయుడు తపస్సు చేసిన ప్రదేశం. ఆయన తపస్సుకు ఆకర్షితుడైన శివుడు స్వయంగా ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశాడని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి, మత విశ్వాసం యొక్క ప్రత్యేకమైన సంగమం కనిపిస్తుంది.
-
Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా
-
Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే
-
Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు
-
Vastu Tips: కిచెన్ స్లాబ్‌పై చపాతీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే
-
Singer Kalpana: చనిపోవాలనిపించింది.. కల్పన బయటపెట్టిన సంచలన విషయాలు
-
Indians: ఇండియన్స్ ఉదయాన్నే ఎందుకు బాత్ చేస్తారు.. దీని వెనుక ఏదైనా సైన్స్ దాగుందా?