Dance Benefits: జస్ట్ 20 ని.లు డాన్స్ చేస్తే చాలు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదట.

Dance Benefits: ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నారు ప్రజలు. కాస్త కూడా సమయం దొరకడం లేదు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల అసలు సమయం దొరకడం లేదు. ఇక వ్యాయామం, జిమ్ లు, వాకింగ్, జాగింగ్ వాటికి సమయం ఉంటుందా? చేసే వారు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి బద్దకం పెరిగిపోతుంది. ఇక ఊబకాయంతో బాధపడేవారు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనుకున్నంత రిజల్ట్ రావడం లేదు. ఇక ఫుడ్ ను కూడా పక్కన పెడుతున్నారు. డైట్ లు చేసి గ్యాస్ సమస్యలను తెచ్చుకుంటున్నారు.
కొత్త కొత్త ప్రయత్నాలు, వింత వింత విధంగా డైట్ లు చేస్తున్నారు. అయినా సరే రిజల్ట్ జీరో. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు జస్ట్ ఓ 20 ని.లు డాన్స్ చేస్తే చాలు మీ బరువు తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. మరి ఎలా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.
కొందరు వంటగదిలో, బాత్రూం లో ఉన్నప్పుడు కూడా సరే వారికి ఇష్టమైన సాంగ్ వినిపిస్తే బాడీని మొత్తం ఊపేస్తుంటారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ డాన్సులు చేస్తుంటారు. కానీ ఇది చాలా మంచిదే. ఇలా ఓ 20 ని. లు మనస్ఫూర్తిగా డాన్స్ చేస్తే చాలా మార్పులు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ వారానికి ఓ 150 ని.లు వ్యాయామం చేయాలి అని చెబుతుంది. అంటే జాగింగ్, జిమ్, ఈత వంటివి కూడా చేయవచ్చు.
ఈ అధ్యయనంలో 18 నుంచి 83 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు పాల్గొన్నారట. ప్రతి రోజు 5 ని.లు వారిని డ్యాన్స్ చేయమని చెప్పారట. ఈ సమయంలో వ్యాయామ తీవ్రతను తెలుసుకోవడానికి ఆక్సిజన్ తీసుకోవడం, హృదయ స్పందన రేటును కొలవడం వంటివి కూడా చేశారు. అయితే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా బాగానే శారీరక శ్రమ చేశారట. అయితే అన్ని వ్యాయామాల కంటే డ్యాన్స్ వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కేవలం 20 నిమిషాలు డ్యాన్స్ చేస్తే కార్డియో యాక్టివిటీకి సమానం అవుతుంది అంటున్నారు నిపుణులు.
మధుమేహం, గుండె జబ్బులు, అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా ఈ డ్యాన్స్ కాపాడుతుంది అంటున్నారు. అయితే ఇదొక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదని ఇదొక శారీరక శ్రమ అంటున్నారు. అందుకే ప్రతి రోజూ కాసేపు డ్యాన్స్ కు సమయం కేటాయించాలట. కనీసం 20 ని. లు కుదిరితే అరగంట అయినా చేయాలి. లేదంటే వ్యాయామం అయినా సరే మస్ట్ గా చేయాలి అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.