IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?

IPL: ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఐపీఎల్ ప్రతీ మ్యాచ్‌లో మీరు గమనిస్తే చీర్ లీడర్లు ఉంటారు. వీరు జట్లుకు సపోర్ట్‌గా ఉంటారు. ఒక్కో జట్టుకు ఒక్కో చీర్ లీడర్లు మద్దతు ఇస్తారు. వీరు మొదటి సీజన్ నుంచి ఉన్నారు. వీరు ఒకొక్క ఫ్రాంచైజీ తరపు నుంచి సపోర్ట్ చేస్తుంటారు. అయితే వీరికి ప్రతీ మ్యాచ్‌కి ఫాంచైజీలు డబ్బులు ఇస్తాయి. అయితే ఒక్కోక్క జట్టు ఒక్కో చీర్ లీడర్లకు డబ్బులు ఇస్తాయి. అయితే కొన్ని జట్లు మ్యాచ్‌లకు ఇంతా అని మాట్లాడుకోగా.. మరికొన్ని ఫాంచైజీలు సీజన్ మొత్తానికి ఇంత అని మాట్లాడుకుంటాయి. అయితే ఐపీఎల్లో చీర్ లీడర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.14,000 నుంచ రూ.17,000 ఇస్తారు. అయితే బెంగళూరు జట్టు, ముంబై ఇండియన్స్ జట్టు రూ.20 వేలు ఇస్తుంది. చీర్ లీడర్లకు వీటితో పాటు బోనస్‌లు, వసతి, ఆహారం అన్ని సౌకర్యాలు కూడా ఇస్తారు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆర్సీబీ ఓడించింది. ఆర్సీబీ జట్టు మొత్తం దూకుడు మీద ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆర్సీబీ జట్టు దూకుడు కొనసాగించింది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే 175 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. సొంత గడ్డపైనే కోల్‌కతాను ఓడించింది. విరాట్ కోహ్లీ (59*), ఫిల్ సాల్ట్ (56) ఆఫ్ సెంచరీలు చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ (34) పరుగులు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆర్సీబీ జట్టు రాణించింది. ఇదే దూకుడు మీద ఫైనల్ వరకు ఆడితే ఈ సారి ఆర్సీబీ కప్పు కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
-
Late Marriage: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?