Marriage : పెళ్లి చేసుకోవడానికి ఇంకా మీరు రెడీగా లేరు.. ఎందుకంటే?

Marriage : ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక తోడు కావాలి అనుకుంటారు. మన పక్కన ఉండేవాళ్లు, వెన్ను తట్టేవాళ్లు, కష్టసుఖాలు పంచుకునే వారు ఒకరు మనతో మన లైఫ్ లో ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఆ సమయం రావడానికి కాస్త టైమ్ పడుతుంది. అయితే ఇప్పుడు మీ లైఫ్ లోకి ఒక పార్టనర్ ను తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఇంతకీ మీరు పూర్తిగా సిద్దంగా ఉన్నారా? లేదా? ఓ సారి ఇది చదివేసేయండి.
జీవితంలో మీరు ఏమి కోరుకుంటున్నారో, మీకు ఏమి నచ్చుతుందో, మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు ఇంకా తెలియదా? అయితే మీరు మీ లైఫ్ లోకి ఇప్పుడే ఇంకో పార్టనర్ ను తెచ్చుకోవడం మంచిది కాదు. మీరు ఇంకా రిలేషన్ లో ఎంటర్ కావడానికి సిద్ధంగా లేరు. ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, మీతో సమయం గడపడం ముఖ్యం. లేకపోతే, మీరు మీ గుర్తింపును కోల్పోయి మీ భాగస్వామికి మాత్రమే సర్దుబాటు చేయడం అవుతుంది.
ఒంటరి: ఒంటరిగా ఉండటం భరించలేక మీరు రిలేషన్ లోకి వెళ్లాలి అనుకుంటున్నారా? కానీ ఇది పచ్చ జెండా కాదు. ఎర్ర జెండా. సరైన సంబంధం అంటే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉండే సంబంధం. ఒకరిపై ఒకరు పూర్తిగా ఆధారపడకుండా ఉండటం. మీరు ఒంటరిగా సంతోషంగా లేకపోతే మీకు నిజమైన ఆనందం ఉండదు.
పాత సంబంధం: మీరు ఇప్పటికీ మీ మాజీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటే, వారి జ్ఞాపకాలను తలచుకుంటూ ఉంటే లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను పదే పదే సెర్చ్ చేస్తుంటే, మీరు కొత్త సంబంధానికి సిద్ధంగా లేరని అర్థం.
ఒక సంబంధంలోకి ప్రవేశించే ముందు, మీ పాత సంబంధానికి సంబంధించిన భావోద్వేగాల నుంచి పూర్తిగా బయటకు రావడం ముఖ్యం. దీని వల్ల మీ కొత్త రిలేషన్ అసలు బాగుండదు.
కెరీర్: మీరు ప్రస్తుతం మీ కెరీర్, చదువులు లేదా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలనుకుంటే, సంబంధాలు మీ ప్రాధాన్యత కాకపోవచ్చు. చాలా సార్లు వ్యక్తులు ఓ రిలేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా వృత్తిపరమైన లేదా వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవచ్చు అనుకుంటారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. సమయం ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. సో ముందు మీరు సెట్ కావడం ముఖ్యం.
స్నేహితులు: చాలా సార్లు మన స్నేహితులందరూ పెళ్లి చేసుకున్నారు అని లేదా వారు రిలేషన్ లో ఉన్నారని ఫీల్ అవుతుంటారు. అంతేకాదు మనం మాత్రమే ఒంటరిగా ఉన్నామని కూడా అనుకుంటారు. అంటే మీరు పూర్తిగా ఫిక్స్ అవలేదు. ఇతరులను చూసి అలా అనుకుంటున్నారు అంతే. సో మీరు ఇంకా సమయం తీసుకోవాలి.
ఈ విషయాలను ఆలోచించండి.
ఒంటరిగా సంతోషంగా లేరా? మీరు మీ పాత సంబంధం నుంచి పూర్తిగా బయటపడ్డారా? మీ జీవితంలో సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు “అవును” అయితే, మీరు సంబంధానికి సిద్ధంగా ఉన్నట్టు. కానీ సమాధానం “లేదు” అయితే, మొదట మీకు మీరు సమయం ఇవ్వండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది.