Relationship : మీ వైఫ్ మిమ్మల్ని అనుమానిస్తుందా? అయినా ఇలా చేస్తే అనుమానించరా బ్రో..

Relationship :
పెళ్లి తర్వాత లైఫ్ లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పులు చేస్తున్నా సరే ఇద్దరికి ఎఫెక్ట్ పడుతుంటుంది. భర్త కొన్ని తప్పులు చేస్తే మాత్రం కచ్చితంగా భార్య ఇబ్బంది పడుతుంది. ఆ విషయాల వల్ల ముఖ్యంగా భార్యకు పదే పదే సందేహాలు వస్తాయి. అంటే అనుమానం అండీ బాబూ.. ఎక్కడో ఏదో తప్పు జరిగే ఉంటుంది అందుకే ఇది రిపీట్ అవుతుంటుంది. కానీ మీరు ముందే గుర్తించి సెట్ చేసుకోకపోతే మీ లైఫ్ సెట్ కాదు. పులిస్టాప్ పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త. అందుకే ఆ మిస్టేక్స్ ఏంటో ముందు తెలుసుకోండి.
ప్రతీది దాచడం లేదా అబద్ధం చెప్పడం
చాలా సార్లు పురుషులు తమ వ్యక్తిగత విషయాలను లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను తమ భార్యల దగ్గర దాస్తుంటారు. ఇవి చిన్న విషయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ భార్యకు ఈ విషయం తెలిసినప్పుడు, భర్త ఒక పెద్ద రహస్యాన్ని దాస్తున్నాడని కచ్చితంగా అనుకుంటుంది. మీరు పదే పదే చిన్న చిన్న అబద్దాలు చెబుతంటే పెద్ద తప్పు చేస్తున్నారు అని అపార్థం చేసుకునే అవకాశం ఉందని గుర్తు పెట్టుకోండి.
దాన్ని ఎలా నివారించాలి?
మీ భార్యతో మీరు మాట్లాడండి. మీరు ఏదైనా కారణం చేత చెప్పకూడదనుకుంటే, దానిని నిజాయితీగా చెప్పండి. అబద్ధం చెప్పకండి. మీ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్ ను ఇస్తుందో వారికి తెలిసి చాలా సంతోషిస్తారు. రిలేషన్ కాపాడుకోవడం చాలా అవసరం.
మొబైల్ / సోషల్ మీడియా: ఫోన్ తో బిజీగా ఉంటూ చాటింగ్ లు, టాకింగ్ లు చేస్తూ ఎవరితో మాట్లాడుతున్నారో దాచాల్సిన అవసరం లేదు. తన ముందే మాట్లాడండి. ఏదైనా టెన్షన్ కాల్ అయితే తన ముందు మాట్లాడి బయటకు వెళ్లండి. కానీ ఏ తప్పు చేయకుండా ఫోన్ రాగానే వెంటనే బయటకు పట్టుకొని వెళ్లి మాట్లాడుతుంటే ఇక మీ భార్యకు అనుమానం మొదలు అవుతుంది బాస్. మీ పని అంతే.. రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ వాడటం, ఎటువంటి కారణం లేకుండా ఫోన్ లాక్ చేసి ఉంచడం లేదా ఎప్పుడూ చాటింగ్‌లో బిజీగా ఉంటే ఏ భార్యకు అనుమానం రాదు చెప్పండి? సో జాగ్రత్త బ్రదర్స్.
దాన్ని ఎలా నివారించాలి?
మీ భార్యకు ఇంపార్టెంట్స్ ఇవ్వండి. సోషల్ మీడియా కంటే తనకు సమయం ఇవ్వడం ఇంపార్టెంట్ అని గుర్తు పెట్టుకోండి. కాల్ మెసేజ్ దాచడం కంటే చెప్పడం ఇంపార్టెంట్. భార్యకు సమయం ఇవ్వకపోవడం, ఆమెను పట్టించుకోకపోవడం పెద్ద తప్పే. సో తనకు కాస్త సమయం ఇవ్వండి.
కెరీర్, ఫ్రెండ్స్:
వివాహం తర్వాత, చాలా మంది పురుషులు తమ కెరీర్, స్నేహితులలో మునిగిపోతారు. వారే ప్రపంచం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వారు తమ భార్యకు సమయం కేటాయించరు. దీని వల్ల తనకు సమయం ఇవ్వడం లేదని బాధ పడుతూనే మీ లైఫ్ లోకి వేరే అమ్మాయి వచ్చిందని భ్రమ పడుతుంటుంది. సో కాస్త థింక్ చేయాల్సిందే.
దాన్ని ఎలా నివారించాలి?
మీ భార్యతో నాణ్యమైన సమయాన్ని గడపండి. చిన్న చిన్న విషయాలలో కూడా తనను జాగ్రత్తగా చూసుకోండి. తనకు కాస్త గిఫ్ట్ లు ఇవ్వండి. బయటకు తీసుకొని వెళ్లండి. ఆమెతో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కనెక్ట్ అవ్వండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Relationship : ముందు ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత పశ్చాత్తాపం.. బట్ ఎందుకు?
-
Love: ప్రేమ కోసం మీరు మారుతున్నారా?
-
Relationship: మీతో వారు అసలు మాట్లాడటం లేదా? సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారా? తప్పు నీదే
-
Relationship: ప్రేమ ఉన్న సరే మీరు విడిపోతారు? ఎందుకంటే?
-
Relationship: ఈ చిన్న విషయాలను పెద్దగా చేస్తున్నారా? అయితే బాండింగ్ బ్రేక్ తప్పదు
-
Relationship : మీ మాజీకి రెండవ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా?