Relationship : మీ మాజీకి రెండవ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా?

Relationship :
ఒకసారి ప్రేమలో పడి మోసం చేసిన తర్వాత ఆ ప్రేమ గురించి ఆలోచించాలి అంటేనే భయం అవుతుంది. లోపల ఎంత బాధ ఉన్నా సరే ఆ వ్యక్తిని చూడాలి, మాట్లాడాలి అనుకోరు. అయితే కొన్ని సార్లు వారు మోసం చేసినా సరే మళ్లీ తిరిగి వస్తే కొందరు ఆక్సెప్ట్ చేస్తుంటారు. ఇంతకీ తిరిగి వచ్చిన ప్రేమను ఆక్సెప్ట్ చేయాలంటే చాలా ప్రేమ ఉండాలి. కానీ ఎప్పుడు స్వాగతించాలో మీకు తెలుసా? నేను మారిపోయాను. ముందులా లేను, ఈ సారి నిన్ను బాధ పెట్టను. సెకండ్ ఛాన్స్ ఇవ్వు అంటారు. కానీ మీరు వెంటనే ఇవ్వకండి. కాస్త ఆగండి. వారు నిజంగా మారిపోయారా, లేక ఇది మరో సారి మోసానికి దారి తీస్తుందా? అయితే మీ మాజీకి మళ్ళీ మీ జీవితంలో స్థానం ఇవ్వాలా వద్దా అని మీరు ఆలోచిస్తుంటే కొన్ని సంకేతాలతో అతను నిజంగా మారిపోయాడా లేదా అనేది తెలుసుకోవచ్చు.
అతను తన తప్పులను ఒప్పుకున్నాడా?
మీ మాజీ ప్రియుడు/ప్రియురాలు తిరిగి కలవాలని చెబుతుంటే ముందుగా తన గత ప్రవర్తనను, తప్పులను పూర్తి నిజాయితీతో అంగీకరించాడో లేదో చూడండి? అతను తన తప్పులను నిజాయితీగా అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అది సానుకూల సంకేతంగా పరిగణించాలి. కానీ గత సంఘటనలను ప్రస్తావిస్తే, తాను సరైనవాడని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే, లేదా మిమ్మల్ని నిందిస్తే, అది పెద్ద తప్పు. వారు ఇంకా మారనట్టే.
ఏదైనా సంబంధానికి మళ్ళీ అవకాశం ఇచ్చే ముందు, మీ మాజీ మునుపటి కంటే మరింత వివేకవంతులుగా, బాధ్యతాయుతంగా మారాడా అని చూడటం ముఖ్యం?వారు ఇప్పుడు తన బాధ్యతలను అర్థం చేసుకోవడం ప్రారంభించి, తన నిర్ణయాల గురించి గంభీరంగా ఉండి, మీతో మంచి భవిష్యత్తును ప్లాన్ చేస్తుంటే, అది మంచి సంకేతం. కానీ వారు ఇప్పటికీ అదే చిన్న పిల్లల వైఖరిని కలిగి ఉండి వారి జీవితంలో స్థిరత్వం లేకపోతే, మళ్ళీ తిరిగి వారికి ఛాన్స్ ఇవ్వడం వేస్ట్.
మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా?
ఒక సంబంధంలో, కేవలం మధురమైన మాటలు, వాగ్దానాలు సరిపోవు, అసలు విషయం ఏమిటంటే మార్పు. మీ మాజీ పాత విషయాలనే పునరావృతం చేస్తూ, వాస్తవానికి ఏదైనా మార్చడానికి ఇష్టపడకపోతే, మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు తన తప్పులను సరిదిద్దుకుంటే తన మాటల ద్వారా కాకుండా తన చర్యల ద్వారా నిరూపిస్తే, అతనికి రెండవ అవకాశం ఇవ్వచ్చు. జస్ట్ క్షమాపణలు చెబుతూ ప్రేపూర్వకమైన విషయాలు చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటే, వారు ఏ మాత్రం మారలేదు అని అర్థం చేసుకోండి.
సమానత్వం ఉంటుందా?
సంబంధంలో అతి ముఖ్యమైన విషయం గౌరవం. సమానత్వం. మునుపటి సంబంధంలో, మీరు మాత్రమే రాజీ పడుతూ, మీరు మాత్రమే సర్దుబాటు చేసుకుంటూ ఉంటే, ఈసారి వారు సంబంధాన్ని సమతుల్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని చూడటం ముఖ్యం? వారు ఇప్పుడు మీ భావాలను గౌరవించి, మీ ఆలోచనలు, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ సంబంధం మెరుగుపడుతుంది. కానీ వారు ఇప్పటికీ తన గురించి మాత్రమే ఆలోచిస్తూ, మీ భావాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే, ఈ సంబంధానికి తిరిగి రాకపోవడమే మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Relationship : ముందు ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత పశ్చాత్తాపం.. బట్ ఎందుకు?