Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..

Paneer : పనీర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పనీర్ కర్రీ బటర్ నన్, లేదా చపాతీ, రోటీ, రుమాల్ రోటీ ఇలా ఏది తిన్నా అబ్బ.. ఎంత సూపర్ గా ఉంటుంది కదా. ఇందులో పోషకాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. మాంసం తినని వారికి ఇదొక మాంసంలా అనిపిస్తుంది. టేస్ట్ లో అదిరిపోతే ఎంతైనా సరే లాగించేయాలని అనిపిస్తుంది. అందులో పోషకాలు కూడా ఎక్కువే. మరి ఎవరు తినకుండా ఉంటారు కదా. అయితే దీన్ని అధికంగా తింటే మాత్రం అధిక రక్తపోటు, ఊబకాయం, జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాల్షియం, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే పనీర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు.
ఈ పనీర్ తో ఒకటేంటి ఎన్నో వంటకాలు చేస్తుంటారు. ఇంటికి అతిథులు వస్తుంటే చాలు ఖచ్చితంగా పనీర్‌తో స్పెషల్ చేస్తారు కొందరు. లేదా ఏదైనా ప్రత్యేక వంటకం తయారు చేయాల్సి వచ్చినప్పుడు, పనీర్ పేరు మొదట వస్తుంది. పనీర్ తినడానికి రుచికరంగా ఉంటుంది అంతేనా? ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పనీర్‌లో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ పనీర్ ను ఎక్కువగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణఉలు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. అయితే ఏ వ్యక్తులు పనీర్ ను ఎంత తినాలి అనే వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. దీంతో మీరు దానిని అధికంగా తీసుకున్నా నాణ్యత లేనిదిగా తీసుకున్నా సరే అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ సమస్య వస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక మీకు లాక్టోస్ అసహనం ఉంటే, దానిని జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే అలాంటి వారికి, పనీర్ తింటే అలెర్జీ వస్తుంది. పనీర్ లో తక్కువ మొత్తంలో లాక్టోస్ ఉంటుంది అందుకే ముందుజాగ్రత్తగా తక్కువ తీసుకోవడం చాలా మంచిది. పనీర్ ఎక్కువగా తింటే ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది. అందువల్ల పనీర్ మషన్స్ కు కారణమవుతుంది. ఉబ్బరంతో పాటు గ్యాస్ సమస్యను కూడా వస్తుంది.
మీరు గుండె జబ్బులతో బాధపడుతుంటే, ఎక్కువగా పనీర్ తీసుకోవద్దు. ముందే ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. కొవ్వు కూడా ఎక్కువే. మరి కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారం గుండె సమస్యలు ఉన్న వారు స్కిప్ చేయాల్సిందే అనే విషయం తెలుసు కదా. ఇక పనీర్ ను మీరు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల మీరు గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఎక్కువగా పనీర్ తినకూడదు. చీజ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. అందువల్ల, దీని అధిక వినియోగం అధిక రక్తపోటుకు కారణమవుతుంది.