Paneer V/S Mushrooms: పనీర్ V/S పుట్టగొడుగులు ఏవి మంచివి?

Paneer V/S Mushrooms: బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అధిక బరువు ఉన్నవారు. ఇక కొందరు వ్యాయామం చేస్తారు. దీంతో పాటు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా జాగ్రత్త పడే వారు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇక చాలా మంది డైట్ ను కూడా ఎక్కువ ఫాలో అవుతున్నారు. అందుకే అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు కొందరు. ఇక కొందరు బరువు తగ్గడానికి పుట్టగొడుగులు లేదా పనీర్ వంటివి తినాలి అని చెబుతారు. మరి పనీర్ మంచిదా? లేదా పుట్టగొడుగులు మంచివా అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పనీర్ ను తినడం చాలా మందికి ఇష్టం. పనీర్ మాసాలా, పాలక్ పనీర్ ను చపాతీతో కలిపి తింటే అబ్బ ఆ టేస్ట్ గురించి చెప్పాల్సిన అసవరం లేదు. సూపర్ టేస్ట్ వస్తుంది కదా. మరి పనీర్ మకు మంచిదా? కాదా? మరి పుట్టగొడుగులు అంటే మీకు ఇష్టమా? వీటి కర్రీ కూడా బాగుంటుంది. మరి రెండింటిని పోల్చితే? సో చూసేద్దామా?
పనీర్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసి బరువు తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది పనీర్. ఇక ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే కడుపు నిండిన ఫీల్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు ఆహారం కూడా మితంగా తీసుకుంటారు. సో బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్. ఇక పనీర్ లో కాల్షియం కూడా ఉంటుంది. ఎముకలకు మంచిది పనీర్. చీజ్ లో కొవ్వు కూడా అధికమే. కానీ మీరు కావాలంటే తక్కువ కొవ్వు ఉన్న పనీర్ కూడా అందుబాటులో ఉంటుంది. చూసి తీసుకోవచ్చు.
పుట్టగొడుగులతో ప్రయోజనాలు?
ఇక పనీర్ గురించి తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో కేలరీలు చాలా తక్కువనట. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్. 100 గ్రా.ల పుట్టగొడుగుల్లో కేవలం 22 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో పైబర్ కూడా ఎక్కువే. జీర్ణక్రియను సరిగ్గా నిర్వహించడంలో సహాయం చేస్తుంది పుట్టగొడుగులు. అంతేకాదు వీటిలో విటమిన్ బి, డి, పొటాషియం, సెలీనియం వంటివి కూడా ఫుల్ గా ఉంటాయి.
రెండింటిలో ఏది బెటర్?
బరువు తగ్గాలి అనుకునే వారికి మాత్రం కచ్చితంగా పుట్టగొడుగులే బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక పనీర్ లో కేలరీలు, కొవ్వు ఉంటుంది కాబట్టి బరువు తక్కువ ఉన్న వారికి మంచి ఎంపిక. ప్రొటీన్ లోపం ఉన్న వారు ఎలాంటి టెన్షన్ లేకుండా పనీర్ ను తీసుకోవచ్చు. కానీ వీరికి పుట్టగొడుగులు పెద్దగా ప్రయోజనం చేకూర్చవు. సో ఈ ప్రయోజనాల దృష్ట్యా మీరు మీకు నచ్చింది? ఉపయోగపడేదాన్ని ఎంచుకోవచ్చు. సో కీప్ హెల్దీ.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.