Kashmir population: హిందు మెజార్టీ ఉండే కశ్మీర్.. ఇప్పుడు ముస్లిం మెజార్టీగా ఎలా మారింది?
Kashmir population: గతంలో కశ్మీర్లో ఎక్కువగా హిందూ మెజార్టీ ఉండేది. కానీ ఇప్పుడు ముస్లిం మెజార్టీ బాగా పెరిగింది. అసలు జమ్మూలో ముస్లిం మెజార్టీ పెరగడానికి కారణం ఏంటి? పాకిస్థాన్ బోర్డర్లో ఉండటమేనా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? లేదా? ఈ స్టోరీలో చూద్దాం.

Kashmir population: భారత దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని కులాలు, మతాల వారు ఉంటారు. అయితే దేశంలో కేవలం హిందూత్వం మాత్రమే ఉండేదని, ఇస్లాం, క్రిస్టియన్ మతం విదేశాల నుంచి వచ్చాయని చెప్పుకుంటారు. అయితే దేశం మొత్తంలో జమ్మూకశ్మీర్ అనేది బార్డర్. పాక్, చైనా వంటి దేశాలను తాకుతూ ఉంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే దేశం మొత్తం మీద చూసుకుంటే.. జమ్మూలో ఎక్కువగా ఇస్లాం మతం వారు. గతంలో కశ్మీర్లో ఎక్కువగా హిందూ మెజార్టీ ఉండేది. కానీ ఇప్పుడు ముస్లిం మెజార్టీ బాగా పెరిగింది. అసలు జమ్మూలో ముస్లిం మెజార్టీ పెరగడానికి కారణం ఏంటి? పాకిస్థాన్ బోర్డర్లో ఉండటమేనా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? లేదా? ఈ స్టోరీలో చూద్దాం.
గతంలో కాశ్మీర్లో ఉండే కొందరు పండిట్లుగా పిలుచుకునేవారు. అయితే అలా ఇస్లాం మతం వచ్చేసరికి వారు ముస్లిం పండిట్ లేదా పండిట్ షేక్ అని పెట్టుకున్నారు. అయితే ఇస్లాం మతం అనేది కాశ్మీర్లో మధ్యలో వచ్చింది. కాశ్మీర్లో ఎక్కువగా హిందువులు మాత్రమే ఉండేవారు. అలాగే బౌద్ధమతం కూడా ఎక్కువగానే ఉండేది. కానీ రాను రాను.. ముస్లిం మెజార్టీగా మారిపోయింది. ఇస్లాం కశ్మీర్లో రాకముందు బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు. అయితే కొందరు హిందూ నుంచి ముస్లింగా మారారు. ఇలా మారిన తర్వాత వారు పేర్లు చివర పండిట్ ఉండగా.. షేక్, బేగం, ఖాన్ ఇలా పెట్టుకునేవారు. బ్రాహ్మణుల్లో పెద్ద తరగతిలో ఉన్నవారు కూడా ముస్లింగా మారిపోయారు. అయితే వీరు ముందు నుంచి బ్రాహ్మణులు కాదు.. బౌద్ధమతం, జైన మతం నుంచి మారిన వారే అని అంటున్నారు. అయితే 8వ శతాబ్దంలో కాశ్మీర్లో తుర్కిక్, అరబ్ దండయాత్రలు పెరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ముస్లిం పాలన స్థాపించారు. ఇలా దాడులు ఎక్కువగా పెరిగిపోవడంతో.. కొందరు ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు అక్కడే ఉండి మతం మార్చుకున్నారు. ఇలా ఇస్లాం మతం స్వీకరించిన వారు ఎక్కువగా ఉంటారు.
పూర్వం జమ్మూ కాశ్మీర్ హిందూ మతానికి ప్రతీకగా ఉండేది. ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువగా హిందూ మతాన్ని పాటించేవారు. శివుడిని ఎక్కువగా ఆరాధించేవారు. అలాగే వీటితో పాటు బౌద్ధ మతం కూడా ఉండేది. రాను రాను అంతా కూడా మారిపోయింది. అయితే జమ్మూ కాశ్మీర్‌లోకి ఇస్లాం మతం 13వ శతాబ్దంలో వచ్చింది. సయ్యద్‌లు, సూఫీ సాధువులు, మీర్ సయ్యద్ అలీ హమ్దానీ వంటి వ్యక్తులు ఇస్లాం మతాన్ని కాశ్మీర్లో వ్యాపించేలా చేశారు. ఇదే క్రమంగా దేశంలో ఇస్లాం మతం ఉన్నవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కువగా వీరే ఉన్నారు. దీనికి తోడు పాక్‌కి బోర్డర్ కావడంతో.. అక్రమంగా చాలా మంది పాక్ పౌరులు వస్తున్నారు. పాక్‌లో ఎక్కువ శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరు హిందూ మతాన్ని అంతం చేసి.. ముస్లిం మతాన్ని వ్యాపింపజేయాలని కేవలం హిందువులను టార్గెట్ చేసి ఇటీవల దాడికి పాల్పడ్డారు. అయితే పాక్‌లో హిందువులు లేరా? అంటే ఉన్నారు. కానీ అక్కడ హిందువులపై దాడులు చేయకుండా కేవలం ఇండియాలో ఉన్న వారిని దాడులు చేశారంటే.. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు.