Language: దేశంలో ఈ ఏడాది ఏ భాష ఎక్కువ మంది మాట్లాడారంటే?

Language: దేశంలో ఎన్నో భాషలు మాట్లాడే వారు ఉన్నారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి కొన్ని భాషలు మాట్లాడుతుంటారు. అయితే దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా ఎక్కువ మంది హిందీ భాషను మాట్లాడుతారు. ఈ ఏడాది దేశంలో దాదాపుగా 540 మిలియన్ల మంది హిందీ మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఇదే దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషగా కూడా ఇదే నిలిచింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ భాష బాగా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే హిందీ తర్వాత బెంగాలీ భాష 100 మిలియన్ల మంది మాట్లాడారు. ఇలా మాట్లాడిన బెంగాలీ భాష రెండో స్థానంలో ఉంది. ఈ బెంగాలీ భాషను పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీటి తర్వాత మరాఠీ (85 మిలియన్లు), తెలుగు (83 మిలియన్లు), తమిళం (78 మిలియన్లు), గుజరాతీ (60 మిలియన్లు), ఉర్దూ (55 మిలియన్లు), కన్నడ (48 మిలియన్లు), ఒడియా (38 మిలియన్లు), మలయాళం (35 మిలియన్లు), పంజాబీ (34 మిలియన్లు) భాషలు ఉన్నాయి. ఎథ్నోలాగ్, భారతదేశ జనాభా లెక్కల డేటా వంటి మూలాలు తెలిపాయి.
ఇండో-ఆర్యన్ భాషలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ద్రావిడ భాషలు అయిన తమిళం, తెలుగు, కన్నడ కూడా ముందంజలో ఉన్నాయి. ఇవి దేశ భాషా ద్వంద్వత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చాలా మంది భారతీయులు బహుభాషావేత్తలు, తరచుగా హిందీ లేదా ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషను మాట్లాడతారు. అయితే కొందరికి ఈ రోజుల్లో కూడా హిందీ అనేది రాదు. కానీ ప్రాంతీయ భాషలను కలిగి ఉన్న జాబితాలో 540 మిలియన్లకు పైగా హిందీ మాట్లాడేవారు ముందున్నారు అంటే ఆలోచించుకోవాల్సిందే. దేశంలో అధికారికంగా మొత్తం 22 భాషలు గుర్తింపు పొందాయి. ఎక్కువగా హిందీ భాషనే మాట్లాడుతున్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కూడా ప్రాంతీయ భాషతో పాటు హిందీ మాట్లాడతారు. అందరికీ కూడా హిందీ భాష వచ్చి ఉంటుంది. ఈ హిందీ భాషను స్కూల్లో కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఉంది. దీనివల్ల చాలా మందికి చిన్నప్పటి నుంచే హిందీ వస్తుంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా కూడా జీవించగలరు. ప్రస్తుతం దేశంలో హిందీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. హిందీ మన జాతీయ భాష కూడా.