Manasa Devi Temple Stampede: ఉత్తరాఖండ్ ఆలయంలో విషాదం
Manasa Devi Temple Stampede హరిద్వార్ లో గంగానదికి సమీపంలోని ఓ చిన్న కొండపై మనసా దేవీ ఆలయం ఉంది.

Manasa Devi Temple Stampede: ఉత్తరాఖండ్ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆలయంలోకి వెళ్లే నడక దారిలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. దారిలో ఓ చోట ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో రద్దీ పెరిగి కలకలానికి దారి తీసింది. కొందరు వెనన్కు తిరిగి వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు సిబ్బంది తరలించారు. హరిద్దార్ లోని ప్రముఖ దేవాలయాల్లో మానసా దేవీ ఆలయం ఒకటి.
హరిద్వార్ లో గంగానదికి సమీపంలోని ఓ చిన్న కొండపై మనసా దేవీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన నాగ దేవతను స్థానికులు సకల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా పూజిస్తారు. ఈ దేవాలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గం, రోడ్ వే రెండు అందుబాటులో ఉన్నాయి. అధిక శాతం మంది రోప్ వే ద్వారా ఆలయానికి వెళుతారు.