Uttar Pradesh Husband: భార్య పై భయం.. ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త అనుమతి
Uttar Pradesh Husband రామ్ చరణ్ ముంబయిలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

Uttar Pradesh Husband: ప్రియుడితో కలిసి జీవించేందుకు భార్యకు భర్త అనుమతి ఇచ్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్ట్ నగర్ జిల్లాకు చెందిన రామ్ చరణ్ తన భార్య జానకీదేవి ని ఆమె ప్రియుడు సోను ప్రజాపతి తో కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చాడు. వర్సామూర్తా గ్రామానికి చెందిన రామ్ చరణ్, జానకీదేవి వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రామ్ చరణ్ ముంబయిలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే జానకికి సమీప గ్రామానికి చెందిన సోను ప్రజాపతి తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏడు నెలల పాటు వారిద్దూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ విషయం రామ్ చరణ్ కు తెలిసి నిలదీస్తే జానకి క్షమాపణ చెప్పింది. దీంతో ఆమెను క్షమించి కొంతకాలం జీవించాడు. అయితే జానకి తన ప్రియుడు సోనుతో జీవించడానికి ఇష్టపడుతోందని, తాను ఆమెతో ఇక కలిసి ఉండలేనని పోలీసులకు తెలిపాడు. నా భార్య ఏదైనా చేస్తుందని భయంగా ఉందని రామ్ చరణ్ వివరించాడు.