Vice Presidential Election: సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, షెడ్యూల్ ఇదే..
Vice Presidential Election సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం.. నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.

Vice Presidential Election: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9న తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్ ధన్ ఖడ్ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్ర పతి ఎన్నికకు నోటిపికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్ పరిశీలన 22 వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం.. నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించేబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజి తరఫున లోక్ సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసన సభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.