Anasuya Bharadwaj: కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన అనసూయ…ఫొటోస్ వైరల్..
Anasuya Bharadwaj: కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన అనసూయ…ఫొటోస్ వైరల్..

బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. పలు టీవీ షోలతో, సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేందుకు వారణాసి వెళ్ళింది.

వారణాసిలో అనసూయ వారణాసి వంటకాలను కూడా రుచి చూసింది. అలాగే వారణాసిలో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ కూడా చేసింది. వీటికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద టీవీ షోలలో కంటే సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అడపాదడపా టీవీ షోలో మాత్రమే ఈమె సందడి చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తన కుటుంబ సభ్యులతో కలిసి కాశి యాత్రకు వెళ్ళింది. వారణాసిలో అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

పూజలు అనంతరం వారణాసిలో షాపింగ్ చేసిన అనసూయ అక్కడ ఫేమస్ అయిన బెనారస్ శారీలను కొనుగోలు చేసింది.

తన కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వంటకాలను కూడా రుచి చూసింది అనసూయ.

అనసూయ భరద్వాజ్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది ఈ అమ్మడు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో దాక్షాయని పాత్రలో పవర్ ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.