Anupama Parameswaran: ఇప్పటికే ఒక భారీ హీట్.. వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న అనుపమ పరమేశ్వరన్..

చాలామంది పెద్దలు పది రాళ్లు విసిరితే ఒక రాయి అయినా తగులుతుంది అని చెప్తుంటారు. అయితే దీని అర్థం ఒక పది ప్రయత్నాలు చేస్తే అందులో ఒకటైన ఫలిస్తుంది అని. అయితే విసిరిన ప్రతి రాయి కూడా తగిలితే ఇంకా వాళ్ళ అదృష్టమే వేరు. ప్రస్తుతం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా గత ఏడాది మూడు రాళ్లు విసిరితే ఒకటే తగిలింది.

గత ఏడాది అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను చూసిన తర్వాత మనమందరము ఇంతకు ఈమె అనుపమ పరమేశ్వర నేనా.. లేకపోతే అనుపమ 2.0 నా అనేంతగా ఆశ్చర్యపోయేలా టిల్లు స్క్వేర్ లో అనుపమ తన పర్ఫామెన్స్ తో దుమ్మురేపింది.

తమిళ సినిమా డ్రాగన్ తెలుగులో కూడా కలెక్షన్లు కొల్లగొట్టే పనిలో ఉంది. అనుపమ క్యారెక్టర్ కి తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. 2025లో అనుపమ ఖాతాలో మరో సక్సెస్ పడింది. ఇక ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ప్రేక్షకులు.

అనుపమ ప్రస్తుతం తన లిస్టులో ఉన్న సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత శతమానం భవతి కాంబినేషన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది.

ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా ప్రారంభమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సంపత్ నంది చెప్పిన కథ బాగా నచ్చడంతో అనుపమ శర్వానంద్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఆల్రెడీ గతంలో ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. వీరిద్దరి కాంబినేషన్ కి మూవీ లవర్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే రెండోసారి కూడా కథ బాగుంటే ఇద్దరి జోడికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

గతంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కలిసి శతమానం భవతి అని సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.

అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అనుపమ తెలుగు తోపాటు తమిళ్లో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.