Maha Kumbh Mela: ఈ నియమాలు పాటిస్తూ.. మహా కుంభమేళాలో చివరి పుణ్య స్నానం ఆచరిస్తే.. పాపాల నుంచి విముక్తి

Maha Kumbh Mela: మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా జరుగుతోంది. భక్తులు కోట్లలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్నారు. ఇప్పటికే 57 కోట్ల మంది ప్రజలు గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు. అయితే జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిస్తుంది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వెళ్తున్నారు. మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరిస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. దీంతో చాలా మంది ఆ పుణ్య నదిలో స్నానం చేసి.. వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. అయితే పవిత్రమైన మహా శివరాత్రి నాడు మహా కుంభమేళాలో చివరి పుణ్య స్నానం ఆచరిస్తారు. కొన్ని నియమాలు పాటిస్తూ మహా కుంభమేళాలో చివరి పుణ్య స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటిస్తూ.. మహా కుంభమేళాలో చివరి పవిత్ర స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
హిందూ మతంలో గంగాదేవిని కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. ఎలాంటి పుణ్య నదుల్లో అయినా స్నానం ఆచరిస్తారు. వీటిలో స్నానం ఆచరిస్తే అంతా మంచే జరుగుతందని నమ్ముతారు. అలాంటిది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరిస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. గంగా నదిలో స్నానం ఆచరించేటప్పుడు ముందుగా గంగాదేవికి పూజ చేయాలి. రాగి చెంబులో నీరు తీసుకుని పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని వేసి అన్ని దేవుళ్లను మొక్కి ఆ తర్వాత స్నానం ఆచరించాలి. ఒక రెండు నిమిషాల పాటు అన్ని దేవుళ్లను కూడా భక్తితో పూజించాలి. మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా.. కేవలం శివుడు, విష్ణువుని తలచుకుని గంగాదేవికి నీరు సమర్పించాలి. ఆ తర్వాత దేవుడిని స్మరిస్తూ.. పుణ్య స్నానం ఆచరించాలి. ఇలా పుణ్య స్నానం ఆచరిస్తే.. తప్పకుండా అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. పాపాలు అన్ని కూడా తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు.