Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పెరిగిన మల కోలిఫామ్ బ్యాక్టీరియా.. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమా!

Prayagraj: ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు గంగా నదిలో స్నానం ఆచరిస్తున్నారు. దీంతో ప్రమాదకర స్థాయిలో గంగా నది కలుషితం అవుతోంది. గంగా నదిలో మల కోలిఫామ్ (coliform bacteria) అనే బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రయాగ్‌రాజ్‌లో కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక నీటి నాణ్యత కూడా లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. మహా కుంభమేళాలో కొన్ని ప్రాంతాల్లో మలం కొలిఫామ్ అనే బ్యాక్టీరియా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా మానవుల్లో ఉంటుంది. ముఖ్యంగా మానవుల ప్రేగుల్లో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉంటుంది. మానవుల మలం నుంచి ఈ బ్యాక్టీరియా పుడుతుంది. వీటివల్ల గంగా నదిలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటున్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సమయంలో మలం వల్ల బ్యాక్టీరియాలు, పరాన్న జీవులు పెరిగి పోతుంటాయి. ఇలా బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఫిబ్రవరి 26వ తేదీన మహా కుంభమేళా పూర్తి అవుతుంది. ఇంతలో ఇంకా భక్తులు ఎక్కువ మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సమయం దగ్గర పడుతున్న కొలది గంగా నదిలో స్నానం ఆచరించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ మల కోలిఫామ్ బ్యాక్టీరియా వల్ల ఎలాంటి ప్రమాదం ఉందో చూద్దాం.
ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా వల్ల మల కోలిఫామ్ పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, ఇన్ఫెక్షన్లు సోకేలా చేస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఎక్కువ మంది స్నానం చేయడం వల్ల నీరు శుద్ధి కాలేదు. దీంతో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా భారీగా కలుషితం అయినట్లు తెలుస్తోంది. గంగా నదిలో ప్రస్తుతం మల కోలిఫామ్ బ్యాక్టీరియా భారీగా పెరిగింది. 100 మిల్లీలీటర్లకు 2,500 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంతలా ఉన్నప్పుడు నదిలో స్నానం ఆచరిస్తున్న వారికి ఇది చాలా ప్రమాదకరం. చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే కళ్ల సమస్యలు, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా ప్రమాదకరమైన అంటువ్యాధులు, జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ సమస్యలు, మూత్రాశయ కేన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గంగా నది నీటిని శుభ్రం చేయకుండా వాడటం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కాబట్టి తొందర పడి భక్తితో నీటిలో స్నానం చేయవద్దు. మహా కుంభమేళా స్నానం ఆచరిస్తే పుణ్యం జరుగుతుందని నమ్మి అనారోగ్య బారిన పడవద్దు. చాలా మంది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా అని వెళ్లి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. మీరు కూడా ఇలా ఆలోచించి పొరపడవద్దు.