Uttar Pradesh: నిజాయితీకి మారు పేరు అంటే ఇతనే!

Uttar Pradesh: నిజాయితీగా ఉండే మనుషులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం రోజుల్లో ఎవరికైనా కూడా పది రూపాయలు దొరికినా తీసుకుంటారు. ఒకవేళ విలువైన వస్తువులు లభ్యమైన కూడా వెంటనే వాటిని దాచుకుంటారు. విలువైన వస్తువు ఇతరులకు బాగా ఉపయోగపడుతుందని కనీసం ఆలోచించకుండా అలాగే మన దగ్గర ఉంచుకుంటాం. సర్లే ఈ వస్తువులు మనకి బాగా ఉపయోగపడతాయని కొందరు భావించి ఉంచుకుంటారు. కానీ ఇతరులకు అవసరం కదా అని వారి అడ్రస్ తెలుసుకుని మరి కూడా ఇవ్వరు. పోతే పోనిలే అనుకుంటారు.. ఎందుకు ఇవ్వడం అని లైట్ తీసుకుంటారు. కానీ ఉత్తరాఖండ్‌లోని ఓ వ్యక్తి మాత్రం ఎవరి వస్తువు, ఎంత విలువైనది పోయినా సరే తప్పకుండా వారిని వెతుక్కుని మరి తీసుకెళ్లి ఇస్తాడు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎవరి వస్తువులను వెతికి తీసుకెళ్లి వారికి ఎలా ఇస్తాడు? ఇలా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
Read Also: ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
ఉత్తరాఖండ్‌లోని రాంనగర్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా వర్క్ చేస్తున్న వినోద్ కుమార్ నీతికి, నిజాయితీకి మారుపేరు. దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఎంతో నిబద్ధతతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఇలా తన కెరీర్ మొత్తంలో 100కి పైగా పోగొట్టుకున్న వస్తువులను ప్రయాణికులకు అందించి హీరోగా నిలిచారు. అయితే ఇలాంటి వారు అరుదుగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా పోయిన వస్తువులను ఇతరులకు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా ఆశపడిన వారే కానీ ఎవరి వస్తువులు వారికి ఇచ్చేద్దామని అనుకునే వారు లేరు. ఎంత వరకు మోసం చేసి ఇతరుల నుంచి సంపాదించాలనే చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారంటే చాలా మందికి నమ్మశక్యంగా కూడా లేదు. వస్తువులు పోయిన వారికి ఎంత దూరం ఉన్నా కూడా వారి అడ్రస్ కనుక్కుని వారికి పంపిస్తారు. ఇలా ఒక మనిషి అడ్రస్ కనుక్కుని మరి వారి వస్తువులను ఇవ్వడం చాలా గ్రేట్. ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మందికి స్ఫూర్తి.