Uttar Pradesh: వధువుకు బదులు ఆమె తల్లి..బిత్తర పోయిన పెళ్ళికొడుకు
Uttar Pradesh ఇది కలికాలం. ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. వివిధ మాధ్యమాల ద్వారా అవి వెలుగులోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరట్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Uttar Pradesh: వివాహం నిశ్చయమైనప్పుడు.. వివాహం జరుగుతున్నప్పుడు ముందుగా వరుడిని తీసుకొస్తారు. పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత వధువును తీసుకొస్తారు. ఇక కొన్ని మతాల సంప్రదాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ముందుగా మాత్రం వరుడే వస్తాడు. ఆ తర్వాత కొన్ని క్రతువులు పూర్తయిన అనంతరం వధువును తీసుకొస్తారు. అనంతరం పెళ్లి తంతు సాగిస్తారు.. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని మేరట్ ప్రాంతంలో ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక్కసారిగా చర్చకు కారణమైంది. అంతేకాదు తనకు న్యాయం చేయాలని వరుడు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.
వధువుకు బదులు ఆమె తల్లి..
సాధారణంగా పెళ్లి పీటలపై వరుడు కూర్చున్న తర్వాత వధువును తీసుకొస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లోని మేరట్ ప్రాంతంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మేరట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అజీమ్ కు శామలి జిల్లా వాసి మంతశా తో వివాహం కుదిరింది.. అయితే నిఖా లో వివాహం జరిపించే మౌల్వి వధువు పేరు “తాహిరా” అని పలికాడు. దీంతో వరుడుకి ఒకసారిగా అనుమానం వచ్చింది. దీంతో ఆమె ముసుగు తొలగించాడు. దీంతో మంతాశ కు బదులుగా ఆమె తల్లి వధువు స్థానంలో కూర్చుంది. మంతాశకు భర్త చనిపోయాడు. దీంతో ఆమె రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. పెళ్లి ఈడుకొచ్చిన కూతురు ఉండడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అజీమ్ వరుసకు అన్నా వదినలయ్యే వారిని మంతశా తల్లి సంప్రదించింది. వారికి డబ్బు ఆశను చూపించింది. దీంతో వారు ఈ నాటకానికి తెర లేపారు. తద్వారా అజీమ్ ను మోసం చేసి మంతశా తల్లితో పెళ్లి చేయడానికి పావులు కదిపారు. ఈ విషయం తెలియని అజీమ్ తనకు కాబోయే భార్య మంతశా అని భావించాడు. కానీ ఆమె స్థానంలో తల్లి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ముసుగు తొలగించడంతో అసలు విషయం వెలుగు చూడడంతో అజీమ్ గట్టిగా కేకలు వేస్తూ పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన అతని అన్నా వదినలను నిలదీశాడు. మంతశా పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారందరిపై పోలీస్ కేసు పెట్టాడు. అయితే దాని కంటే ముందు పెళ్లి మండపంలో అజీమ్ ను అతడికి అన్నా వదిన వరుసయ్యేవారు, మంతశా తల్లి బెదిరించారు.. వేధింపులకు కేసు పెడతామని బెదిరించారు. అయినప్పటికీ అజీమ్ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పెళ్లి కోసం అజీమ్ లక్షల్లో ఖర్చు పెట్టాడు. కానీ చివరికి ఇలా జరగడంతో నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.