Maha Shivaratri: అదృష్టం అంటే ఈ రాశులదే.. మహా శివరాత్రి నుంచి పట్టబోతున్న అదృష్ట యోగం
Maha Shivaratri:

Maha Shivaratri: ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి పండుగ వస్తోంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భక్తితో శివుడిని పూజిస్తారు. భక్తితో శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది శివరాత్రి రోజున శివుని ఆలయాన్ని సందర్శించి.. ఎంతో భక్తితో పూజించి రాత్రంతా జాగారం చేస్తారు. శివుడిని ఇలా పూజిస్తే కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. అయితే కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఒక్కోసారి మంచి జరిగితే, ఒక్కోసారి నష్టాలు జరుగుతాయి. అయితే మహా శివరాత్రి పండుగ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది. గ్రహాల కలయిక వల్ల రాశి చక్రంలోని మూడు రాశుల వారికి మంచి జరగనుంది. మరి ఆ మూడు రాశులేవి? వారికి ఎలాంటి అదృష్ట యోగం పట్టబోతుందో ఈ స్టోరీలో చూద్దాం.
వృషభ రాశి
రాశి చక్రంలోని రెండో రాశి అయిన వృషభ రాశికి మహా శివరాత్రి నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. నిజం చెప్పాలంటే వీరికి కుబేర యోగం పట్టబోతుంది. ఇకపై ఆర్థిక సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. ఎలాంటి సమస్యలు, రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఇకపై ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే బయటకు వెళ్తారు. ఎక్కువగా తీర్థ యాత్రలు చేస్తారు. సమయం వృథా చేయకుండా జీవితంపై కాస్త సమయం వెచ్చిస్తారు. అన్ని విధాలుగా కూడా వీరికి ఇకపై అంతా కూడా బాగుంటుంది.
సింహ రాశి
ఈ మహా శివరాత్రి నుంచి సింహా రాశి వారికి బాగుంటుంది. వీరికి ఇకపై మహాలక్ష్మీ అనుగ్రహం బాగా ఉంటుంది. దీంతో ఎక్కువగా భూమి లేదా వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. అదృష్టం కొలది ధనం కలిసి వస్తుంది. సమస్యలు అన్ని కూడా తీరిపోయి కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అన్ని అనారోగ్య సమస్యలు క్లియర్ అయినా కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇకపై రాజయోగం పట్టబోతుంది. వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయి. ఎలాంటి వ్యాపారం పెట్టినా కూడా కలసి వస్తుంది. అనుకోకుండా ధన లాభం ఉంటుంది. అన్ని విధాలుగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. అలాగే ఉద్యోగులకు ఇది మంచి అవకాశం. కోరిన ఉద్యోగం లభిస్తుంది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Zodiac signs: కుజుడు, శని కలయిక.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేరయోగం
-
Zodiac Signs: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.