TTD: భక్తులకు టీటీడీ అలర్ట్
TTD దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు తెలిపారు.

TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్టినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు తిరుమలలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.