TTD Non Religious Employees: అన్యమత ఉద్యోగులను గుర్తించేందుకు టీటీడీ ప్లాన్..
TTD Non Religious Employees 2018 లో టీటీడీ నిర్వహించిన విజిటెన్స్ విచారణలో దాదాపు 44 మంది అన్య మతస్తులు టీటీడీలో ఉన్నారని తెలుస్తోంది.

TTD Non Religious Employees: టీటీడీలో అన్యమత ఉద్యోగులను గుర్తించడానికి తనిఖీలు నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. టీటీడీ చట్టం ప్రకారం హిందువులు మాత్రమే పనిచేయాలి. ఈ చట్టం దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కొంతమంది అన్యమతస్తులు టీటీడీలో చేరారు. ఈ నేపథ్యంలో 2018 లో టీటీడీ నిర్వహించిన విజిటెన్స్ విచారణలో దాదాపు 44 మంది అన్య మతస్తులు టీటీడీలో ఉన్నారని తెలుస్తోంది. టీటీడీ యాజమాన్యం 44 మంది హిందుయేతరులకు నోటీసులు జారీ చేసింది.
వారు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో అన్యమత ఉద్యోగులపై ఎలాంటి నిఘా లేదు. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత గట్టిగా వ్యవహరిస్తున్నాం. అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం ఇచ్చాం. కొంత మంది ముందుకు వచ్చారు. అయినప్పటికి కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. విచారణలో తేలితే వారిని కూడా సస్పెండ్ చేస్తామని తెలిపారు.