Ugadi Pachadi: ఉగాది పచ్చడి వెనుక ఇంత స్టోరీ ఉందా?
Ugadi Pachadi ఉగాది పచ్చడిలో తప్పకుండా వేప పువ్వు వాడుతారు. ఈ చేదు జీవితంలో కష్టాలు, బాధలు అన్ని కూడా సహజమే అని తెలియజేస్తుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని తెలియజేయడానికి వాడుతారు.

Ugadi Pachadi: హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైనది. తెలుగు వారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతీ ఒక్క హిందువులు జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే హిందువుల కొత్త సంవత్సరం ఉగాది చైత్ర మాసంలోని శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతుంది. హిందూ మతానికి చెందిన ప్రజలు ఈ రోజును చాలా ప్రత్యేకంగా కొత్త దుస్తులు, కొత్త వస్తువులతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఉగాది అంటే అందరికీ కూడా ఫస్ట్ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. అన్ని రుచులు కలిగి ఉన్న ఈ పచ్చడిలోని ఆరు రుచులు దేనికి అర్థమో ఈ స్టోరీలో చూద్దాం.
తీపి
ఉగాది పచ్చడి చేయడానికి ముందుగా ఉపయోగించే వాటిలో బెల్లం ఒకటి. ఇది నోటిని తీపి చేస్తుంది. అలాగే జీవితంలో సంతోషం, ఆనందం, అన్ని విజయాలు కూడా అందాలని తీపి తినిపిస్తారు. ఈ క్రమంలోనే ఉగాది పచ్చడిలో కూడా దీన్ని వాడుతారు.
చేదు
ఉగాది పచ్చడిలో తప్పకుండా వేప పువ్వు వాడుతారు. ఈ చేదు జీవితంలో కష్టాలు, బాధలు అన్ని కూడా సహజమే అని తెలియజేస్తుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని తెలియజేయడానికి వాడుతారు.
పులుపు
ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింత పండును వాడుతారు. అయితే దీన్ని మొదట తిన్నప్పుడు బాగుంటుంది. కానీ ఆ తర్వాత చిరాకును తెచ్చిపెడుతుంది. అలాగే జీవితంలో కూడా ఒడిదుడుకులు, కష్టనష్టాలు అనేవి సహజం. వాటిన్నింటిని కూడా దాటుకుంటూ వెళ్లాలని పులుపు వాడుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కాస్త సహనం, ఓర్పుతో వాటిని దాటాలనే ఉద్దేశంతో పులుపు వాడుతారు.
కారం
ఉగాది పచ్చడిలో కారం వాడటానికి ఓ కారణం ఉంది. కోపం మనిషికి శత్రువు. జీవితంలో ఇతరులపై కోపగించుకోకూడదన, ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని తెలుసుకోవాలని దీన్ని వాడుతారు. జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఎంతో సహనంతో ఉండాలని ఉద్దేశంతో కారం వాడుతారు.
ఉప్పు
ఉప్పు అనేది ఉత్సాహానికి నిదర్శనం. నిజానికి కూరల్లో ఉప్పు లేకపోతే అసలు వంట టేస్ట్ ఉండదు. అలాగే జీవితంలో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు పోవాలి. లైఫ్ ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటే అసలు ఏం ఉండదని, జీవితం ఎంతో ఉత్సాహంతో ముందుకు పోవాలని పచ్చడిలో ఉప్పు వేస్తారు.
వగరు
ఉగాది పచ్చడిలో ముఖ్యమైనది వగరు. మామిడి కాయలతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. వగరు అంటే జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. అంతే కానీ కష్టం, బాధలు వచ్చాయని అలా కూర్చోకూడదని వగరు కలుపుతారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి సమస్యలు అనేవి సహజం. వీటి కోసం బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఏం జరిగినా కూడా మన మంచికే.. జీవితంలో ఇలాంటి సమస్యలు అనేవి సహజమని తెలుసుకోవాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.