Vastu Tips: కంప్యూటర్ ఏ దిశలో ఉంటే.. విజయం తథ్యమవుతుందో మీకు తెలుసా?

Vastu Tips:
ఇంట్లో చాలా మంది వాస్తు నియమాలు ఎక్కువ గా పాటిస్తుంటారు. ఏ వస్తువును ఎక్కడ పెట్టాలన్నా కూడా తప్పకుండా వాస్తు పాటిస్తారు. వీటివల్ల మంచి జరుగుతుందని కొందరు నమ్ముతారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టి వర్క్ చేస్తుంటారు. అయితే కంప్యూటర్ పెట్టే పద్ధతిలో కూడా వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్‌ను సరైన పద్ధతిలో పెట్టకపోతే ప్రతికూల శక్తి ఉంటుంది. సరైన పద్ధతిలో కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాప్ పెట్టడం వల్ల మంచి అనుకూల ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి కంప్యూటర్‌ను ఏ దిశలో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
కంప్యూటర్‌ను ఇంట్లో దక్షిణం లేదా పడమర వైపు పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. దీనివల్ల అన్ని సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయి. ప్రతీ విషయంలో విజయం లభిస్తుంది. అలాగే కంప్యూటర్ టేబుల్ పైన పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. వీటితో పాటు ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు. కంప్యూటర్ టేబుల్ పైన కూడా ఎలాంటి చెత్త ఉండకూడదు. దీనివల్ల ఎక్కువగా ప్రతికూల శక్తి ఇంట్లో ఉంటుంది. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. ప్రతీ దాంట్లో కూడా సమస్యలు ఎదురు అవుతాయి. కొందరు కంప్యూటర్ పై మంచి ఫొటోలు, కొటేషన్స్ వంటివి పెట్టుకుంటారు. వీటివల్ల కూడా సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే వీటిని కుడి వైపు కాకుండా ఎడమ వైపు పెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలాంటి కొన్ని మార్పులు చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే సానుకూల శక్తి ఏర్పడుతుంది. అయితే కొందరు కంప్యూటర్ టేబుల్‌పై అద్దం పెడుతుంటారు. ఇలా అద్దం పెట్టడం వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. సానుకూల శక్తి అంతా కూడా పోతుంది. ఇవే కాకుండా పదునైన వస్తువులు కూడా పెట్టకూడదు. వీటివల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు చెబుతున్నారు.
కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను సరైన పద్ధతిలో పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రతీ విషయంలో అనుకున్న పనులు జరుగుతాయి. ఇంట్లో సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. సంతోషంగా ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ దిశలో పెట్టి వ్యాపారాలు చేసినా కూడా లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. కాబట్టి మీరు సరైన పద్ధతిలో మాత్రమే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను పెట్టండి.