Sanju Samson: కేకేఆర్ లోకి సంజు శాంసన్..
Sanju Samson అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు, ఇండియా టీం ఓపెనర్ సంజు సంశాన్ గురించి కీలక విషయ తెలిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ లో శాంసన్ చేరినట్లు తెలుస్తోంది.

Sanju Samson: వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముందు సంజు శాంసన్ మరో ఫ్రాంచైజీకి మారనున్నట్లు తెలుస్తోంది. ఇండియా జట్టుకు చిన్న విరామం ఉన్న సమయంలో ఐపీఎల్ పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు, ఇండియా టీం ఓపెనర్ సంజు సంశాన్ గురించి కీలక విషయ తెలిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ లో శాంసన్ చేరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పోటీకి వేలానికి ముందే ఆర్ ఆర్ కెప్టెన్ ఎంపిక నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రఘువంశీ లేదా రమణ్ దీప్ సింగ్ వంటి హై ప్రొఫైల్ ఆటగాళ్లను రాజస్థాన్ కు ఇచ్చి సంజను తమ టీమ్ లోకి కేకే ఆర్ తీసుకోవాలని యోచిస్తోందంటా. అయితే ఇప్పటికే చెన్సై సూపర్ కింగ్స్ సంజను తమ టీమ్ లోని తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ కూడా సంజు కోసం రంగంలోకి దిగింది.