IPL 2025 : రాజస్థాన్ రాయల్స్‌ను వీడి CSKలోకి సంజు శాంసన్? నిజమెంత?

IPL 2025 : ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్లేఆఫ్‌కు చేరుకోలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు వచ్చే సీజన్లో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson) గురించి ఒక పెద్ద షాకింగ్ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు, నివేదికల ప్రకారం.. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో ట్రేడ్ దాదాపు ఖరారైందని, వచ్చే సీజన్ నుంచి అతను CSK పసుపు జెర్సీలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.
CSKలోకి సంజు శాంసన్?
సాధారణంగా ఐపీఎల్లో ట్రేడింగ్ విండో సీజన్ ముగిసిన 7 రోజుల తర్వాత నుంచి ఆక్షన్ (వేలం)కు వారం రోజుల ముందు వరకు తెరిచి ఉంటుంది. ఈ సమయంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంజు శాంసన్ CSKతో ట్రేడ్ కాబోతున్నాడని, అంతా సవ్యంగా జరిగితే వచ్చే సీజన్లో అతను CSKలో భాగమవుతాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తనుకు అంతా బాగా లేదని, అందుకే సంజు జట్టును విడిచిపెట్టాల్సి వస్తుందని కూడా కొందరు యూజర్లు వాదిస్తున్నారు.
Read Aslo: Katrina Kaif : సల్మాన్-రణ్బీర్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా
సంజు శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2018 నుంచి అతను ఈ జట్టుతోనే ఉన్నాడు. దీనితో పాటు 2021లో అతన్ని ఈ జట్టుకు కెప్టెన్‌గా చేశారు. 2022లో అతను జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. అయితే, సంజు శాంసన్ ట్రేడ్ వార్తల విషయానికి వస్తే ఇవి ప్రస్తుతం కేవలం సోషల్ మీడియా ఆధారితమైనవి మాత్రమే. ఏ అధికారిక వర్గం లేదా ఫ్రాంచైజీ కూడా దీనిని ధృవీకరించలేదు. BCCI లేదా IPL నుంచి కూడా అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. కాబట్టి, ప్రస్తుతానికి ఇది కేవలం ఒక అఫవా మాత్రమే అని చెప్పొచ్చు.
సంజు శాంసన్ గాయం RR ఆటను దెబ్బతీసిందా?
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లను మాత్రమే గెలవగలిగింది. 10 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. సంజు శాంసన్ కూడా కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. సంజు శాంసన్‌కు గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కొన్ని మ్యాచ్‌లలో అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఇది రాజస్థాన్ ఆటపై కూడా ప్రభావం చూపింది. అయితే, RR జట్టు ఇప్పుడు ఈ సీజన్ ఓటమిని మర్చిపోయి వచ్చే సీజన్లో స్ట్రాంగ్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
Read Aslo: IPL Scam : ఐపీఎల్ సెలక్షన్ పేరుతో ఆశ చూపించి..రూ.23లక్షలు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు
-
IPL Scam : ఐపీఎల్ సెలక్షన్ పేరుతో ఆశ చూపించి..రూ.23లక్షలు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు
-
Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
-
IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్‌లన్నీ నామమాత్రం!
-
IPL 2025: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
-
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్