West Indies cricketer retirement: స్టార్ క్రికెటర్ 29 ఏళ్లకే రిటైర్మెంట్.. కారణమిదే!

West Indies cricketer retirement: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 29 సంవత్సరాల వయస్సులోనే ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. మంచి ఫామ్‌లో ఉండి, భారీ షాట్లు అలవోకగా ఆడే సత్తా ఉన్న పూరన్ ఇంత త్వరగా వీడ్కోలు పలకడం అనూహ్యంగా మారింది. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పూరన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. చాలా ఆలోచించిన తర్వాత, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. మనం ఇష్టపడే ఆట ఆనందం, లక్ష్యం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. మెరూన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతం కోసం నిలబడటం, నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా శక్తి మేరకు ప్రయత్నించడం.. వీటిని చెప్పడానికి మాటలు లేవు” అని పూరన్ తన భావోద్వేగాలను పంచుకున్నాడు.
వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించడం ఒక గొప్ప అవకాశమని, అది ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని పూరన్ తెలిపాడు. అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు. వారి నమ్మకం, మద్దతు తనను ముందుకు నడిపించాయని పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్ ముగిసినప్పటికీ, వెస్టిండీస్ క్రికెట్‌పై తన ప్రేమ ఎప్పటికీ తరగదని, జట్టుకు విజయం, బలం చేకూరాలని కోరాడు. పూరన్ వెస్టిండీస్ తరఫున 61 టీ20లు, 106 వన్డేలు ఆడగా అందులో వన్డేల్లో మొత్తం 1983 పరుగులు చేశాడు. అయితే వీటిలో మొత్తం 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20ల్లో 2275 పరుగులు (13 ఫిఫ్టీస్) చేశాడు. అంతర్జాతీయ టీ20లలో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నికోలస్ పూరన్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన పూరన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉండటం ఐపీఎల్‌లో రాణిస్తుండటం వల్ల అతని రిటైర్మెంట్ మరింత షాకింగ్‌గా మారింది. పూరన్ 2016లో దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మే 2022లో వెస్టిండీస్ వైట్-బాల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతను చివరిసారిగా డిసెంబర్ 2024లో కింగ్‌స్టౌన్, జమైకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున ఆడాడు. ఆ మ్యాచ్‌లో 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు. భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు కేవలం 8 నెలలు మాత్రమే మిగిలి ఉండగా, పూరన్ రిటైర్మెంట్ నిర్ణయం వెస్టిండీస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం