Piyush Chawla: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్.. కారణమిదే!

Piyush Chawla: భారతదేశ ప్రముఖ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 2007లో జరిగిన టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా ఇతను ఉన్నారు. కానీ ఈ సమయంలో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా పీయూష్‌కి రాలేదు. అలాగే 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచారు. ఈ రెండు భారత జట్టులో పీయూష్ చావ్లా ప్రాతినిథ్యం వహించారు. అయితే దేశానికి రెండు ప్రపంచ కప్‌లు అందించిన జట్టులో భాగమై ఉన్నారు. 2012లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. పీయూష్ చావ్లా క్రికెట్‌కి వీడ్కోలు చెబుతూ తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి, అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయిన పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో ఐపీఎల్ ఒక ప్రత్యేక అధ్యాయమని, దానిలో ఆడిన ప్రతి క్షణాన్ని తాను ఎంతో ఆనందించానని పీయూష్ అన్నారు.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
పీయూష్ చావ్లా 2006లో మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2007లో బంగ్లాదేశ్‌తో వన్డే అరంగేట్రం చేయగా, 2010లో దక్షిణాఫ్రికాతో టీ20ల్లోకి వచ్చారు. చివరి సారిగా 2012 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్, 2011లో నెదర్లాండ్స్‌తో వన్డే, 2012లో వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో చివరి టీ20 మ్యాచ్ పీయూష్ భారత్ తరఫున ఆడారు. ఆ తర్వాత ఆయనకు టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా కూడా పీయూష్ ఉన్నారు. భారతదేశం తరఫున పీయూష్ చావ్లా మొత్తం 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి అందులో మొత్తం 7 వికెట్లు తీశాడు. వన్డేల మ్యాచ్‌ల్లో మొత్తం 25 ఆడి అందులో 32 వికెట్లు తీశాడు. ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడి అందులో 4 వికెట్లు మొత్తం పడగొట్టారు. ఐపీఎల్‌లో పీయూష్ మొత్తం 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశారు. గత సంవత్సరం ఆయన ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ, మెగా వేలంలో ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా కూడా చేశారు.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
West Indies cricketer retirement: స్టార్ క్రికెటర్ 29 ఏళ్లకే రిటైర్మెంట్.. కారణమిదే!
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు