Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు
Bad news for RCB fans: ఈ జన్మకి ఆర్సీబీ జట్టు కప్ కొట్టదని, ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ నుంచి తొలగించాలని చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తు్ంటారు. అదే విధంగా ఆర్సీబీ జట్టు ఈ సారి ఫైనల్‌లో కప్ కొట్టాలని కోరుకుంటున్నారు.

Bad news for RCB fans: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ భారత్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఫైనల్‌కు వెళ్లిన పంజాబ్, ఆర్సీబీ రెండు జట్లు కూడా ఇప్పటికీ ఒక్కసారి కప్ గెలవలేదు. ఈ రెండు జట్ల 18 కల ఈ కప్. ఆర్సీబీ, పంజాబ్ జట్లు మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ఈ సీజన్‌లో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్క కప్ కూడా గెలవలేదు. మూడు సార్లు చేయి వరకు వచ్చి కప్ చేజారిపోయింది. ఫైనల్‌కు ఆర్సీబీ జట్టు మూడు సార్లు వెళ్లింది. కానీ విన్నర్‌గా కప్‌తో రాకుండా రన్నర్‌గా తిరిగి వచ్చాయి. మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు కప్ కొట్టింది. కానీ పురుషులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక కప్ కూడా కొట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో వీరిపై భారీగా ట్రోలింగ్ జరగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై అయితే చెప్పక్కర్లేదు.
Also Read: IPL 2025 : ఫైనల్‌లో ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ రిపీట్ అవుతుందా? అయ్యర్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా ?
ఈ జన్మకి ఆర్సీబీ జట్టు కప్ కొట్టదని, ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ నుంచి తొలగించాలని చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తు్ంటారు. అదే విధంగా ఆర్సీబీ జట్టు ఈ సారి ఫైనల్‌లో కప్ కొట్టాలని కోరుకుంటున్నారు. అయితే ఎవరైతే మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే రిజర్డ్వ్ డే ఉంటుంది. అయితే ఈ డే రోజు కూడా వర్షం పడితే ఇక బెంగళూరు జట్టు ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే రిజర్డ్వ్ రోజు కూడా వర్షం పడితే 5 ఓవర్లకు మ్యాచ్ నిర్వహిస్తారు. లేదా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దీనికి కూడా ఆస్కారం లేదంటే మాత్రం పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న పంజాబ్ జట్టు కప్‌ను ఎగరేసుకుపోతుంది. దీంతో ఆర్సీబీ జట్టు రన్నరప్‌గా నిలుస్తుంది. వరుణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వర్షం పడకూడదని, ఎలాగైనా ఆర్సీబీ జట్టు కప్ గెలవాలని కోరుకుంటున్నారు.
ఆర్సీబీ, పంజాబ్ ఫైనల్ మ్యా్చ్ ప్రారంభమైనప్పుడు ఒకవేళ వర్షం పడితే.. గంటన్నర అదనపు సమయం లోగా పూర్తిగా తగ్గితే 20 ఓవర్లలో మ్యాచ్ జరిపిస్తారు. గంటన్నర కంటే ఎక్కువ సమయం వర్షం అంతరాయం ఏర్పడితే ఓవర్లను కుదిస్తారు. మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. అంటే మంగళవాం భారీ వర్షం కురిసి మ్యాచ్ సాధ్యం కాకపోతే మరుసటి రోజు (బుధవారం) నిర్వహిస్తారు. మ్యాచ్ టై అయినప్పుడు ఎప్పట్లాగే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్‌లో కూడా టై అయితే ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అందులో గెలిచిన టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్‌ను కొట్టలేకపోయాయి. దీంతో ఓవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ అభిమానులు.. మరోవైపు ఆర్సీబీ అభిమానులు తమ జట్టే గెలవాలని కోరుకుంటున్నారు.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!
-
Piyush Chawla: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్.. కారణమిదే!
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!