GBS: ప్రజలను భయపెట్టిస్తున్న జీబీఎస్ వైరస్.. ఫీవర్ కదా అని లైట్ తీసుకున్నారా.. అంతే సంగతులు

GBS:తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. దీనివల్ల ఎన్నో కోళ్లు చనిపోయాయి. దీంతో చాలా మంది చికెన్ తినకుండా దూరంగా ఉన్నారు. అయితే బర్డ్ ఫ్లూతో పాటు ప్రస్తుతం జీబీఎస్ (Guillain-Barre syndrome) వైరస్ ప్రజలను వణికిస్తోంది. ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఇప్పటికే అధికారులు తెలిపారు. కానీ రోజురోజుకీ దీని తీవ్రత పెరుగుతుంది. ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు వైరస్ ఉన్న ఎక్కువ ప్రమాదం లేదని లైట్ తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ జీబీఎస్ వైరస్ (Guillain-Barre syndrome) అనేది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ అవుతుంది. ఇటీవల ఓ మహిళ గుంటూరులో ఈ వైరస్ బారిన కూడా పడింది. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించగా మళ్లీ ఇప్పుడు జీబీఎస్ (Guillain-Barre syndrome) వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ మాత్రం చిన్న లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు జ్వరం వస్తే.. సాధారణ జ్వరం అని లైట్ తీసుకుంటారు. ఏదో ఒక చిన్న టాబ్లెట్ వేసి ఊరుకుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే జ్వరం అనేది జీబీఎస్ వైరస్ లక్షణాల్లో ఒకటి. మొదటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత వాంతులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి జ్వరం వస్తే అసలు లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గులియన్ బారీ సిండ్రోమ్ రావడానికి ముఖ్య కారణం పోషకాలు లేని కలుషితమైన ఆహారం తీసుకోవడమేనని వైద్యులు చెబుతున్నారు. కొందరు తెలిసో తెలియక కలుషితమైన నీరు తీసుకుంటారు. ఇందులోని బ్యాక్టీరియా గులియన్ బారీ సిండ్రోమ్ వచ్చేలా చేస్తుంది. ముందుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఆ తర్వాత వాంతులు, జ్వరం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తుంది. చివరకు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ఈ వైరస్ బారిన పడి మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ బాడీలో ఎలాంటి చిన్న లక్షణం కనిపించినా కూడా అసలు లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.