Virus: చాప కింద నీరులా విస్తరిస్తున్న వింత వ్యాధి.. 53 మందికి పైగా మృతి.. ఎక్కడంటే?

Virus:
ప్రస్తుతం కాంగోలో ఓ వింత వ్యాధి ప్రజలను భయపెడుతోంది. కరోనా కంటే ఈ వ్యాధి డేంజర్. ఒక్కసారి వస్తే మనిషి బతకడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఓ అంతు చిక్కని వ్యాధి కాంగోతో పాటు ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు 48 గంటల్లోనే మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా యావత్తు ప్రపంచాన్ని వణికించింది. ఈ కోవిడ్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇతరులకు సోకి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ కోవిడ్ కంటే ఈ అంతు చిక్కని వ్యాధి డేంజర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ బారిన పడి కాంగోలో ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు ఆ దేశం ప్రకటించింది. కరోనా కంటే ప్రమాదకరమైన ఈ వైరస్ ఒక్కసారి వస్తే ఇక ప్రాణం పైకే. ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని, అందరూ కూడా అప్రమత్తం కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచించింది. ప్రపంచాన్ని ఈ వైరస్ కూడా వణింకించే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే ఈ వైరస్‌కి శాస్త్రవేత్తలు ఇంకా ఎలాంటి పేరు కూడా పెట్టలేదు. ప్రస్తుతం కాంగోలో ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది.
ఈ ఏడాది జనవరిలో వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. కాంగోలో ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని బోలోకో అనే గ్రామంలో ఈ వైరస్‌ను వైద్యులు గుర్తించారు. బోలోకోలో గ్రామంలో ఇద్దరు పిల్లలకు ఈ వైరస్ సోకింది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోకగా.. అది వ్యాప్తి చెందింది. దీంతో వైరస్ సోకిన వెంటనే ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ పిల్లలు అందరికి కూడా అలసట, విరేచనాలు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించిన తర్వాతే మృతి చెందినట్లు గుర్తించారు. వీటితో పాటు రక్తస్రావం సంకేతాలు, ఎపిస్టాక్సిస్, హెమటెమిసిస్ వంటి లక్షణాలు కూడా కనిపించాయట. అయితే ఈ పిల్లలు చనిపోయే ముందు గబ్బిలం మాంసం తిన్నట్లు తేలింది. వీటివల్ల ఈ వైరస్ సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ వస్తే మాత్రం కొన్ని లక్షణాలు బాడీలో కనిపిస్తాయి. కాస్త తలనొప్పిగా ఉండటం శరీర నొప్పులు, జ్వరం, చలి, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ చిన్న లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకితే లైట్ తీసుకోవద్దు.