Strawberry Moon: స్ట్రాబెర్రీ మూన్.. ఇంత అందమైన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడో తెలుసా?

Strawberry Moon: స్ట్రాబెర్రీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాంటిది స్ట్రాబెర్రీ మూన్ అంటే చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవని నిపుణులు అంటున్నారు. స్ట్రాబెర్రీ మూన్ జూన్ 11న అనగా పౌర్ణమి నాడు ఆకాశంలో కనువిందు చేయనుంది. వసంతకాలం చివరి పౌర్ణమి లేదా వేసవికాలం మొదటి పౌర్ణమి అని అంటారు. ఈసారి స్ట్రాబెర్రీ మూన్ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. దాదాపు రెండు దశాబ్దాలలో ఇది అత్యంత తక్కువ ఎత్తులో కనిపించే పౌర్ణమి కానుంది. ఈ అద్భుత దృశ్యం మళ్లీ 2043 వరకు కనిపించదు. కాబట్టి అసలు దీన్ని చూడటం మిస్ చేసుకోవద్దు. స్ట్రాబెర్రీ రంగులో అంటే పింక్ లేదా ఎరుపు రంగులో చంద్రుడు ఉంటాడని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. స్ట్రాబెర్రీ మూన్‌కు రంగుతో సంబంధం లేదు. ఈ పేరు స్థానిక అమెరికన్ తెగల సంప్రదాయాల నుంచి వచ్చింది. జూన్ నెలలో పూర్తి చంద్రుడు కనిపించినప్పుడు ఆ ప్రాంతంలో అడవి స్ట్రాబెర్రీలు కోతకు సిద్ధంగా ఉంటాయని గుర్తించారు. అందుకే ఈ పౌర్ణమికి “స్ట్రాబెర్రీ మూన్” అనే పేరు వచ్చింది. యూరోపియన్, కాలనీల కాలం నాటి అమెరికన్ సంప్రదాయాలలో కూడా ఈ పేరు వాడుకలో ఉంది.
ఈసారి స్ట్రాబెర్రీ మూన్ చాలా ప్రత్యేకమైనది కావడానికి ఓ ముఖ్య కారణం ఉంది. మేజర్ లూనార్ స్టాండ్‌స్టిల్ కారణంగా చంద్రుని కక్ష్య, భూమి చుట్టూ తిరిగే మార్గం సాధారణం కంటే భిన్నంగా ఉంటుంది. దీనివల్ల చంద్రుడు ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో, క్షితిజానికి దగ్గరగా కనిపిస్తాడు. ఈ అరుదైన ఖగోళ సంఘటన దాదాపు 18.6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అందుకే ఈసారి స్ట్రాబెర్రీ మూన్ మరింత అద్భుతంగా, సువర్ణ కాంతితో మెరుస్తూ కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ మూన్ జూన్ 11వ తేదీ వరకు కనిపిస్తుంది. అయితే స్ట్రాబెర్రీ మూన్ తక్కువ కాంతి కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో కనిపించదు. ప్రాంతాలు, విశాలమైన మైదానాలు, లేదా కొండ ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది. ఆగ్నేయ దిక్కులో చంద్రుడు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు చూడాలి. అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌తో చూస్తే బాగా కనిపిస్తుంది. మీరు ఫోటోలు తీయాలనుకుంటే తక్కువ కాంతిలో కూడా బాగా పనిచేసే DSLR కెమెరాను, స్టెబిలిటీ కోసం ట్రైపాడ్‌లో తీసుకెళ్లాలి. స్ట్రాబెర్రీ మూన్ అయినప్పటికీ చంద్రుడు పింక్ లేదా స్ట్రాబెర్రీ రంగులో కనిపించడు. అయితే ఈసారి చంద్రుడు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల, అతని కాంతి భూమి వాతావరణం గుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీనివల్ల నీలం రంగు తరంగాలు చెల్లాచెదురుగా మారి, ఎరుపు, నారింజ రంగులు ఎక్కువగా ప్రకాశిస్తాయి. అందుకే చంద్రుడు పసుపు, నారింజ రంగులో కనిపించే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం